ఓడిపోయారు అనటం కంటే రాజకీయంగా ఎలాంటి అనుభవం లేని వెనిగండ్ల రాము చేతిలో ఏకంగా 53,000 ఓట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఇది కొడాలి నాని కెరీర్‌లో దారుణ పరాజయం. ఎన్నికల్లో ఓటమి ముందే అర్థమైందో ఏమో కానీ.. నాని ప్రచారంలో ఇవే తనుకు చివరి ఎన్నికలు.. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయను అని చెప్పుకుంటూ వచ్చారు. అయినా గుడివాడ జనాలు కొడాలి నానినీ చిత్తుచిత్తుగా ఓడించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నాని నియోజకవర్గంలో అసలు యాక్టివ్ గా ఉండటం లేదు. ఎక్కువగా హైదరాబాద్‌కు పరిమితం అవుతున్నారు. ఆయన అనారోగ్యంతో హైదరాబాదులో చికిత్స తీసుకుంటున్నారని రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రచారం కూడా జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. కొడాలి నాని రాజకీయ సన్యాసం చేస్తే గుడివాడలో జగన్ కొత్త ఎత్తుగడ వేస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు గుడివాడలో వైసీపీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నానికి సీటు ఇస్తూ వస్తోంది. నాని తప్పుకుంటే.. గుడివాడలో వైసీపీ ఈసారి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు లేదా బీసీ వర్గానికి చెందిన నేతకు గుడివాడ నియోజకవర్గ వైసీపీ పగ్గాలు అప్పగిస్తుంది అన్న ప్రచారం వైసీపీ అధిష్టాన వర్గాల్లో నడుస్తోంది. మరి నాని నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్నది కొద్ది నెలల్లోనే స్పష్టత రానుంది.