తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో అవమానం ఎదురయింది. సీఎం రేవంత్ రెడ్డి పేరును మరో యాంకర్.. మర్చిపోవడం జరిగింది. దీంతో ఈ వివాదం రాజుకుంటుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయిన యాంకర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆ యాంకర్ జైలుకు వెళ్లడం గ్యారంటీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా..హైదరాబాద్ హైటెక్స్‌లో ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలు జరిగాయి.

 ఈ సందర్భంగా తెలుగు సమాఖ్య మహాసభలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా.. అక్కడ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. రేవంత్ రెడ్డిని స్టేజి పైకి పిలిచే క్రమంలో... తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు యాంకర్. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. అయితే అక్కడే ఉన్నవారు యాంకర్ ను అలర్టు చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.

 దీంతో వెంటనే... ప్రియతమ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ స్వరం మార్చారు ఆ యాంకర్. కానీ అప్పటికే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను గులాబీ పార్టీ సోషల్ మీడియా తెగ వాడేసుకుంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఎవరికి తెలియడం లేదని... అసలు ఆయనకు మర్యాద కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి లేదని సెటైర్లు పేల్చుతోంది  గులాబీ పార్టీ సోషల్ మీడియా.

 మొన్నటికి హీరో అల్లు అర్జున్ పేరు మర్చిపోతే... అతన్ని జైల్లో వేశారని గుర్తు చేస్తోంది. ఇక ఇప్పుడు ఈ యాంకర్ ను కూడా జైల్లో వేస్తారని... సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ మహాసభల్లోనే... రేవంత్ రెడ్డి అంటే ఎవరో తెలియనట్లుగా నటి జయసుధ వ్యవహరించారు. స్టేజ్ పైన ఉన్న అందరిని పలకరించిన నటి జయసుధ... రేవంత్ రెడ్డిని పలకరించలేదు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే ఆ యాంకర్.. నటుడు బాల ఆదిత్య అని తెలుస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: