అందులో ఒక లెటర్ రాశారు.. అందులో భారతి గారి పేరు, కేఎన్ఆర్ పేరు, రీతూ చౌదరి, సజ్జల వంటి వారి పేర్లను కూడా రాశారని వార్తలు వైరల్ గా మారుతున్నాయి కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా.. ఇప్పుడు అందులో నెక్స్ట్ స్టెప్ కి వచ్చేస్తోంది. కూటమి మీడియా అనుకూలంలో వచ్చాయి అంటే నెక్స్ట్ జరిగేది ఇదే అని పలువు విశ్లేషకులు తెలియజేస్తున్నారు.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అరెస్టు చేసిన ఇబ్రహీంపట్నం మాజీ సబ్ రిజిస్టర్.. బాల బాల నాగ ధర్మ సింగ్..చీమకుట్టి శ్రీకాంత్, మాజీ ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి అనిల్ రెడ్డి తమను బెదిరించి ఒత్తిడి చేసి వేలకోట్ల రూపాయల విలువైన భూములను తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారని సింగ్ చంద్రబాబుకు లేసిన లేఖలో శనివారం రోజున ఇచ్చారనే విధంగా తెలిపారు.
దీని ఆధారంగా అధికారులు విచారణ చేపట్టారట.. చీమకుట్టి శ్రీకాంత్ పై దాదాపుగాను 156 కోట్ల విలువైన భూములు, ఆస్తి లావాదేవులు రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయని ప్రాథమికంగా తేలిందని అధికారులు వివరించారు. శ్రీకాంత్ తో పాటు ఆయన భార్య వనం దివ్య,అలాగే శ్రీకాంత్ తండ్రి పైన కూడా పలు రకాల ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ఆలేఖకు వీరు పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన స్టాంపులను, పేపర్లను కూడా జత చేశారట. దీని మీద మరొక లోతైన దర్యాప్తు చేయబోతున్నామని తెలుపుతున్నారు.
అయితే సింగ్ గతంలో రాసిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారుతోందట. అయితే అతడు తప్పించుకోవడానికి ఇలా చేశారని సమాచారం.. అయితే వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడే సింగ్ మిద రైడ్ చేశారట.. పారిపోయింది కూడా అప్పుడే నట. దాని నుంచి తప్పించుకోవాలి అంటే .. ఇప్పుడు జగన్ ని ఇలా అందరినీ లాగితే ఈ ప్రభుత్వం తనకి అండగా ఉంటుందని సింగ్ భావిస్తున్నట్లు సమాచారం. మరి సీఎం చంద్రబాబు సహకరిస్తారో లేదో చూడాలి.