అయితే ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే 11 వేల కోట్ల అప్పు చేయబోతోంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, జీతాలు అలాగే వడ్డీలు కట్టేందుకు గాను అప్పు తీసుకోనుంది చంద్రబాబు కూటమి సర్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్పు చేయబోతున్నాయి.
దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు మొత్తం 4.73 లక్షల కోట్లు బహిరంగ మార్కెట్ లో నుంచి అప్పులు తీసు కోబోతున్నాయట. అయితే అప్పులు తీసుకోబోతున్న లిస్టులో రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ అలాగే ఆంధ్ర ప్రదేశ్ ఉన్నాయి. bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం... జనవరి నుంచి మార్చి త్రైమాసికం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 11 వేల కోట్లు అప్పు చేయబోతుంది.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం 30000 వేల కోట్లు అప్పు చేయబోతున్నట్లు.... రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు అప్పు తీసుకున్న కూడా... నాన రచ్చ చేసేది ఎల్లో మీడియా. కానీ ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత... అసలు అప్పు తప్పే కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి కూటమి కి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు. ఆంధ్ర ప్రదేశ్ డెవలప్ మెంట్ కోసం ఆ మాత్రం చేయకూడదా అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.