మలేషియాలో సైతం హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటే మంచిదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ వైరస్ శ్వాసకోశ వ్యాధులు కలిగించే ఒక రకమైన వైరస్ కాగా పిల్లలు, వృద్ధులతో పాటు ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవాళ్లు ఈ వైరస్ విషయంలో ఒకింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. ఈ వైరస్ బారిన పడిన వాళ్లలో జ్వరం, గొంతు నొప్పి, దగ్గు లాంటి లక్షణాలు కీలకం కానున్నాయి.
ఈ వైరస్ తీవ్రమైతే న్యుమోనియా, బ్రాంకైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్ కు సంబంధించిన లక్షణాలను ఎంత వేగంగా గుర్తిస్తే అంత మంచిది. నిరంతర జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, బలహీనత, అలసట, శ్వాస సంబంధిత సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్య చికిత్స చేయించుకుంటే మంచిది. ఈ లక్షణాల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాలకే ప్రమాదం కలుగుతుంది.
ఇప్పటికే ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వాళ్లు సరైన సమయంలో వైద్య చికిత్స చేయించుకోవడం ద్వారా ఈ వైరస్ బారిన పడే అవకాశాలను తగ్గించుకోవచ్చు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవాళ్లు మాత్రం వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. లక్షణాల ఆధారంగా మందులు వాడటం వల్ల ఈ వ్యాధికి చెక్ పెట్టవచ్చు. హెచ్ఎంపీవీ వైరస్ వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.