- ( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ ) . . .


దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగా వారసుడుగా చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చారు వంగవీటి రాధా. 2004లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ ఎమ్మెల్యేగా గెలిచిన రాధా చిన్న వయసులోనే తిరుగులేని క్రేజ్‌ సొంతం చేసుకున్నారు. తన తండ్రి తన ఫ్యామిలీ నుంచి వచ్చిన బలమైన అభిమాన గణాన్ని తన వైపుకు తిప్పుకున్న రాధా రాజకీయంగా వేసిన తప్పటడుగులతో కెరీర్ పరంగా పాతాళానికి వెళ్లిపోయారు. 2009 ఎన్నికల రాజశేఖర్ రెడ్డి మంత్రి పదవి ఇస్తానని చెప్పిన రాధా ప్రజారాజ్యంలోకి వెళ్లి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి 2014 ఎన్నికలలో మరోసారి ఓటమి చెందారు. ఇక 2019 ఎన్నికల జగన్ రాధాను ఘోరంగా అవమానించారు .. ఆయనకు సీటు లేకుండా చేశారు. తాను విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తాను అని చెప్పిన జగన్‌ పట్టించుకోలేదు ఇష్టమైతే తూర్పు నుంచి పోటీ చెయ్యి లేకపోతే అవ‌నిగడ్డ అసెంబ్లీ లేదా బందరు పార్లమెంట్ కు పో అని బలవంతంగా బయటకు నెట్టేశారు.


ఆ ఎన్నికలలో వైసిపి నుంచి బయటికి వచ్చి తెలుగుదేశం పార్టీ కోసం రాధా ప్రచారం చేశారు. పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఐదేళ్లపాటు ఇష్టమో కష్టమో గానీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. ఇప్పుడు బలమైన వంగవీటి ఫ్యామిలీ లెగసీని రాజకీయంగా కంటిన్యూ చేసేందుకు చంద్రబాబు రాధకు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారు. ఎప్పుడో 2004లో 21 సంవత్సరాలు క్రితం తొలిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టిన రాధా మళ్ళీ ఆ తర్వాత చట్టసభల్లోకి అడుగు పెట్టలేదు. ఆ తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 21 సంవత్సరాలు తర్వాత టిడిపి నుంచి ఎమ్మెల్సీగా రాధా చట్టసభలలోకి అడుగుపెట్టబోతున్నారు. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా రాధా రాజకీయంగా రాణిస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: