ఈ నేపథ్యంలోనే ఇలాంటి కేసులలో అరెస్ట్ చేయవద్దని తీర్పునివ్వడం చెప్పడం అనేది కుదరని పని అని స్పష్టం చేసింది ధర్మస్థానం. ఫార్ములా ఈ కారు రేసు కేసులో తెలంగాణ ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దన్న మధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తివేయడంతో త్వరలో ఏం జరగబోతోందో అని సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ సుప్రీంకోర్టు వెళ్లే యోచనలో ఉన్నట్టు కనబడుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. కేటీఆర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలకు సిద్ధపడ్డారు. ఈ తరుణంలోనే గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాస్‌లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాంతో ఏం జరుగుతుంది? అని ఉత్కంఠగా మారింది. అయితే.. తన ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతాయని ఈరోజు (జనవరి 06న) ఉదయమే కేటీఆర్ మీడియాతో చెప్పటం కొసమెరుపు. ఆయన చెప్పినట్టుగానే ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో సోదాలకు ఉపక్రమించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేబినెట్ ఆమోదం లేకుండానే డబ్బులు ముట్టజెప్పారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆ సమయంలో మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్‌ను ఏ1గా ఏసీబీ చేర్చింది.