చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించి విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా ఎదిగాడు. రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించాడు వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. 


సముద్ర కని, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, ఎస్ జె సూర్య కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం శరవేగంగా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నాయి. కాగా, గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త వైరల్ గా మారుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని కాకుండా మొదట దీపికా పదుకొనే, ఆలియా భట్ వంటి హీరోయిన్లతో సినిమా చేయాలని వారిని సంప్రదించారట.


కానీ ఆలియా భట్, దీపికా పదుకొనే వేరే షూటింగ్ లలో బిజీగా ఉండడంతో ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించారట. దీంతో ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీని ఫైనల్ చేశారట. ఇక హీరోగా రామ్ చరణ్ ని కాకుండా ఓ తమిళ స్టార్ హీరోని అనుకున్నారట. కానీ ఆ హీరో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. ఆ హీరో మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్.


సినిమా స్టోరీని డైరెక్టర్ శంకర్ మొదట దళపతి విజయ్ కి వినిపించారట. కానీ ఏమైందో తెలియదు విజయ్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత శంకర్సినిమా స్టోరీని రామ్ చరణ్ వద్దకు వెళ్లి వినిపించగా చెర్రీ ఈ సినిమాకు ఓకే చెప్పాడట. వెంటనే సినిమా షూటింగ్ ప్రారంభించారట. గేమ్ చేంజర్ సినిమాను విజయ్ దళపతి మిస్ చేసుకున్నాడని దళపతి అభిమానులు కాస్త ఫీలవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: