ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేసి తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం అందుతోంది. ఈ నెల 26వ తేదీ వరకు ప్రజాభిప్రాయాలను తీసుకోనున్నారు. విద్యార్థులకు ఒత్తిడి తగ్గి ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని ప్రభుత్వం యోచిస్తుండటం గమనార్హం. వచ్చే ఏడాది నుంచి సిలబస్ లో భారీ మార్పులు చేసి పాఠ్యాంశాలను తగ్గించే దిశగా అడుగులు వేయనున్నారని సమాచారం.
విద్యా సంవత్సరంలోనూ కీలక మార్పులు తేవాలని ఇంటర్ విద్యామండలి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. జూన్ 1 నుంచి మార్చితో విద్యా సంవత్సరం ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే నెలలు కాలేజీలకు సెలవులు ఇస్తున్నారు. ఇకపై వేసవి సెలవులను విద్యా సంవత్సరం మధ్యలోకి తేవాలని ఇంటర్ బోర్డు ఫీలవుతుండటం గమనార్హం.
ఏప్రిల్ 1 నుంచి తర్వాత విద్యా సంవత్సరం మొదలు కానుందని సమాచారం అందుతోంది. ఏప్రిల్‌లో 1 నుంచి 24 వరకు తరగతులు నిర్వహించనున్నారని తెలుస్తోంది. జూన్ నెల 1వ తేదీన కాలేజీలు తెరుస్తారని సమాచారం అందుతోంది. వేసవి సెలవులకు ముందు పూర్తిచేసిన సిలబస్ నుంచి బోధన కొనసాగించనున్నారని తెలుస్తోంది. వైరల్ అవుతున్న వార్త ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు అనే చెప్పాలి. ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. పరీక్షలను ఎత్తివేస్తే ఉద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఏపీ సర్కార్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.