తిరుపతి దేవస్థానానికి వెళ్లాలని చాలామంది భక్తులు కోరుకుంటున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఒక సంఘటన జరగడంతో భక్తులందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. వైకుంఠ ఏకాదశి కావడం చేత భక్తులు ఎక్కువగా రావడంతో కట్టుదిట్టమైన ప్రణాళికతో టిటిడి భక్తులకు సేవలు అందించడానికి ప్రయత్నాలు చేయడంతో అందరూ ప్రశంసలు కురిపించారు. కానీ అదే రోజు సాయంత్రం అనుకోని సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టికెట్ల జారీ దగ్గర తోపులాట తొక్కిసలాట జరగడంతో ఏకంగా 6 మంది మృతి చెందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఇందులో మరింత మందికి గాయాలయ్యాయని అయితే దీనంతటికీ  కారణం ఇద్దరు వ్యక్తులు అని అక్కడ భక్తులు సైతం ఆరోపిస్తున్నారు.. అయితే వారు కావాలని ఉద్దేశంతోనే ఈ పని చేశారని కూడా వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పని చేసిన ఆ ఇద్దరు? ఎవరా? అని టిటీడి అధికారులు పోలీసులు ఆరాధిస్తున్నారు. టికెట్ల జారీ క్యూ లైన్ వద్ద అనారోగ్యంతో వృద్ధురాలు ఆయాస పడుతూ ఉండడానికి గుర్తించిన కొందరు ఆ గ్రూపులో తప్పించి ఆమెను గేటు లోపల నుంచి తీసుకువచ్చేందుకు అక్కడ ఉండే టీటీడీ సిబ్బంది ప్రయత్నించగా అందుకు భక్తులు కూడా సహకరించారట.



అయితే ఆమె ఒకతిని లోపలికి తీసుకు వెళుతున్నారని కానీ ఇంతలో కొంతమంది దూరం నుంచి కేకలు అరపులతో దుమారం రేపారు. అక్కడి నుంచి తోపులాటగా మారింది అయితే ఇది ఎవరు చేశారన్న విషయం మాత్రం ఇంకా తెలియడం లేదట. ఇది ఎవరైనా ఒకరు ఇద్దరు చేశారా లేకపోతే ఏదైనా గుంపు చేసిన పని అనే అనుమానాలు కూడా తెలియజేస్తున్నారు. ఈ తొక్కిసలాట ఘటనను టీటీడీ అధికారులు చాలా తీవ్రంగా పరిగణంలోకి తీసుకున్నారు. అందుకే అన్ని వైపులా సిసి ఫుటేజ్ లో ఆధారంగా తొక్కిస్లాట ఎలా జరిగిందో పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. అయితే భక్తులు మాత్రం ఇది కావాలనే వెనుక నుండి తోపులాట చేసిన తొక్కిసలాట అని తెలియజేశారు. మరి తిరుపతిలో జరిగే ఈ సంఘటన భక్తులను కలచి వేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: