తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తుల మధ్య తోపులాట జరిగింది.. భారీగా జనాలు దూసుకు రావడంతో తొక్కిసలాట జరిగింది.. ఈ తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు..ఈ విధారకరమైన ఘటన గురించి తెలిసిన సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో అద్భుత కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతి లో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. కొందరు అధికారుల నిర్లక్ష్యం, లెక్కలేనితనం వల్లే ఇంతటి ఘోర ప్రమాదం జరిగిందని చంద్రబాబు తెలిపారు.ఆ అధికారుల మీద సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ అధికారాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు .

భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు.. అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని అధికారులను చంద్రబాబు  ప్రశ్నించారు. ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా ని  వారిని నిలదీశారు. తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరగడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై సీఎంకు జిల్లా అధికారులు వివరించారు. మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 

టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ, భద్రతను పున:సమీక్షించాలనిఆయన సూచించారు. నేడు ఉదయం తిరుపతికి వెళ్లి క్షతగాత్రులను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. అయితే మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకరు తమిళనాడు సేలంకి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు ..ఈ ఘటనలో మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: