తిరుపతి తోక్కిసలాట ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.ఈ నేపథ్యంలోనే డిఎస్పి అత్యుత్సాహం, పోలీసుల అనుచిత ప్రవర్తన వల్లే ఈ ఘటన జరిగిందని అక్కడ లైవ్ లో చూసిన చాలామంది భక్తులు పోలీసులపై విరుచుకుపడుతున్నారు.. వైకుంఠ ఏకదశి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి లక్షకు పైగా భక్తులు అక్కడికి వచ్చారు. ఇక డిఎస్పి తన అత్యుత్సాహంతో ఒకేసారి కంపార్ట్మెంట్ గేట్ ని ఎత్తివేయడంతో అక్కడ ఉన్న జనాలు అందరూ ఒక్కసారిగా లోపలికి వచ్చారు.ఇక అలా అందరు ఒకేసారి రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు వదిలారు. ఇక ఈ ఘటన జరిగాక కూడా డిఎస్పి సరైన రీతిలో స్పందించలేదని తెలుస్తోంది.డిఎస్పి తో పాటు అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కూడా కొంతమంది ప్రాణాలు వదిలారని తెలుస్తోంది. అంబులెన్స్ డ్రైవర్ అక్కడ పార్క్ చేసి 20 నిమిషాల వరకు మళ్లీ రాలేదట.

ఇక అంబులెన్స్ కరెక్ట్ టైం కి ఉండి ఉంటే గనుక కచ్చితంగా కొంతమంది ప్రాణాలతో బయటపడేవారని అక్కడ లైవ్ లో చేసిన భక్తులు అంటున్నారు. అలాగే పోలీసులు అనుచితంగా ప్రవర్తించి అతి ప్రవర్తన,నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు.అంతేకాదు గేటు దగ్గర నిలబడ్డ పోలీసులు అక్కడికి వచ్చిన భక్తులను ఇష్టం వచ్చినట్లుగా అటు ఇటు లాగి పడేశారు. దీంతో కొంతమంది కింద పడిపోవడంతో ఈ ఘటన జరిగింది. అక్కడ మహిళలని కూడా చూడకుండా చాలా దారుణంగా పోలీసులు ప్రవర్తించారు. అంతే కాదు కొంతమంది పోలీసులు భక్తులపై లాఠీ ఛార్జ్ కూడా చేశారు. ఇది కూడా తొక్కిసలాటకి కారణమైంది.ఈ తొక్కిసలాట కు కారణమైన పోలీసులపై,సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని లైవ్ లో చూసిన ప్రత్యక్ష సాక్షులు డిమాండ్ చేస్తున్నారు.

 ఇప్పటికే ఈ ఘటనపై చంద్రబాబు సిబ్బందిపై సీరియస్ అయి వెంటనే మంత్రులను అక్కడికి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశాడు. ప్రస్తుతం అక్కడ గాయపడిన వారికి రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అలాగే ఇప్పటికే 40 మందికి గాయాలు కాగా నలుగురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఇక చంద్రబాబు మంత్రులను తిరుపతి వెళ్లి వారికి సహాయం అందించాలని కోరారు. అలాగే వైకుంఠ ఏకాదశి ని అక్కడున్న సిబ్బంది చాలా సిల్లీగా తీసుకున్నారని, పోలీసులు దాన్ని సింపుల్ గా తీసుకోని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ఘటన జరిగిందని సీఎం చంద్రబాబు సిబ్బందిపై సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఘటన మాత్రం చాలా బాధాకరం. తొక్కి సలాటలో మరణించిన వారి కుటుంబ సభ్యుల ఏడుపులు మిన్నంటాయి

మరింత సమాచారం తెలుసుకోండి: