తిరుమల శ్రీవారి సన్నిధి లో గతంలో ఎన్నడూ లేని విధంగా విషాదకర సంఘటన చోటు చేసుకుంది. తిరుమల దర్శనానికి వెళ్లి... పరలోకానికి వెళ్లిపోయారు. ఏకంగా ఆరు మంది తిరుమల శ్రీవారి భక్తులు... తొక్కి సలాటలో మరణించడం జరిగింది. దర్శన టికెట్ల కోసం క్యూ లైన్ కట్టిన భక్తులు... భద్రత వైఫల్యం కారణంగా.. మరణించారు. తిరుమల చరిత్రలో ఆరుగురు ఒకేరోజు మరణించడం అత్యంత విషాదకరం.

 అయితే ఈ సంఘటనలో.... అక్కడ ఉన్న పోలీసుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది. భద్రత వైఫల్యం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు అక్కడే ఉన్న భక్తులు కూడా చెబుతున్నారు. సరైన భద్రత ఏర్పాటు చేయకపోవడం వల్ల... ఒకరిని ఒకరు నెట్టేసుకున్నారని... కొంతమంది భక్తులు చెబుతున్నారు. అంతేకాదు కొంతమంది భక్తులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు కూడా బయటికి వస్తున్నాయి.  అక్కడే ఉన్న పోలీసులను భక్తులు నిలదీయడం లాంటి సంఘటనలు కూడా బయటకు వచ్చాయి.

 ఈ వీడియోలను చూస్తుంటే కచ్చితంగా పోలీసుల వైఫల్యం కారణంగానే ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. అయితే సంఘటన నేపథ్యంలో A1 గా సీఎం చంద్రబాబు నాయుడు పేరును చేర్చాలని కొంతమంది డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ సంఘటన జరిగిన వెంబడే... యాక్టివ్ అయిన వైసీపీ పార్టీ... చంద్రబాబుపై కేసు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తుంది. గతంలో కుంభమేళా సమయంలో కూడా ఇలాంటి సంఘటనకు కారణం చంద్రబాబు నాయుడు అంటూ.... గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు.

 కాబట్టి చంద్రబాబు నాయుడు ను బాధ్యున్ని చేస్తూ  A1 గా చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పేరు  A2 గా చేర్చాలని ఫైర్ అవుతున్నారు నేతలు, తిరుమల శ్రీవారి భక్తులు. అటు ttd చైర్మన్ బి ఆర్ నాయుడు పదవి తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ముగ్గురిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని వైసిపి నేతలు... సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. మరి దీనిపై కూటమి ప్రభుత్వ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: