తిరుమల తిరుపతి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల తొక్కిసలాట ఘటన ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతుందా ? ఈ ఘటన వెనక ఇద్దరు వ్యక్తుల అత్యుత్సాహం  చూపించారా ? ఒకరు డిఎస్పి అయితే మరొకరు అంబులెన్స్ డ్రైవర్లా ? దీని వెనక ఏమైనా రాజకీయ కుట్ర ఉందా ? ఇప్పుడు ఇవే ప్రశ్నలు చాలామంది భక్తులను వెంటాడుతున్నాయి . శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విషయంలో వారం నుంచి భక్తులను అలర్ట్ చేసింది టీటీడీ .. నేరుగా చైర్మన్ బి.ఆర్ నాయుడు రంగంలోకి దిగి టిక్కెట్లు జారీ చేసే కేంద్రాలను పరిశీలించారు .. ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేశారు. అయినా కొందరు అత్యుత్సాహం వల్ల తొక్కేసిలాట జరిగింది .. ఈ ఘటన లో 6  భక్తులు చనిపోయారు .. 29 మంది వరకు  భక్తులు గాయపడినట్లు తెలుస్తుంది . అలాగే బైరాగి పట్టెడ పద్మావతి పార్కులో జరిగిన తొక్కేసులాట ఘటనపై నివేదికను సీఎం చంద్రబాబుకు అందించినట్టు తెలుస్తుంది .. అలాగే ఈ ఘటన విషయం తెలియగానే సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. తొక్కిసలాట వెనుక వెంటనే రిపోర్టు కావాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై నివేదిక సీఎం చంద్రబాబుకు అందినట్టు  సమాచారం. ఓ డీఎస్పీ చేసిన అత్యుత్సాహం కారణంగా ఇదంతా జరిగినట్టు తేలింది.


ఇక తిరుపతిలోని  బైరాగి పట్టెడ పద్మావతి పార్క్‌లో  తొక్కిసలాట ఘటనపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెను దుమారం రేపుతుంది .  ఈ ఘటన జరిగిన తర్వాత సరైన రీతిలో డిఎస్పీ స్పందించలేదని నివేదిక చెబుతుంది .. సరైన సమయంలో అదనపు సిబ్బందితో ఏసిపి సుబ్బారాయుడు ఇతర పోలీస్ సిబ్బంది చేరుకొని కిందపడిపోయిన భక్తులను బయటకు తీసుకుని వచ్చి సిపిఆర్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు .. లేకుంటే మృతుల సంఖ్య మరింత పెరిగి ఉండేదని కూడా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు . ఇది ఒకవైపు మాత్రమే అని రెండో వైపు చూస్తే అంబులెన్స్ వాహనాన్ని టికెట్ల కౌంటర్ బయట పార్కు చేసి వెళ్లిపోయారు డ్రైవర్లు .. ఈ ఘటన జరిగిన దాదాపు 20 నిమిషాల వరకు వారు అందుబాటులోకి రాలేదు . ఇటు డిఎస్పి అటు అంబులెన్స్ డ్రైవర్లు నిర్లక్ష్యం కారణంగా మృతులు సంఖ్య పెరిగిందని తెలుస్తుంది .. ఇక డిఎస్పి వ్యవహార శైలిపై ఏసీపీ సుబ్బారాయుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు .


ఇక ప్రస్తుతానికి  ప్రాథమిక రిపోర్ట్ ను అధికారులు సీఎంకు అందజేశారు .. పూర్తి డీటెయిల్స్ త్వరలోనే అందజేయనున్నారు .. ఇక ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు .. ఇక గురువారం సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు .. ఇక 2022లో టోకెన్ల వ్యవస్థను తీసుకువచ్చింది అప్పటి జగన్ సర్కార్ .. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు జారీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేసింది గడిచిన రెండేళ్ల నుంచి ఇదే విధంగా తొక్కిసలాట జరిగిందనే టాక్ కూడా బయట వినిపిస్తుంది .. అయితే ఇప్పుడు ఈ ఘటన తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది వైసీపీ వెంకన్న దర్శనానికి  టోకెన్ల కోసం పోటెత్తిన భక్త జనానికి భద్రత కోసం ఎలాంటి ఏర్పాట్లు ఇటు ప్రభుత్వ, అటు టీటీడీ చేయలేదని, ఆ నిర్లక్ష్యం కారణంగా ఆరుగురు మృతి చెందారని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: