నిన్నటి రోజున రాత్రి తిరుపతిలో తొక్కిసలాటలో భాగంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీంతో కొంతమంది గాయాలు అవ్వడమే కాకుండా మృత్యువాతతో పోరాడుతున్నారు. అయితే దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు మాటలు బాధ్యతారహితంగా ఉండడంతో చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. వైకుంఠ దర్శనం ద్వార దర్శన టికెట్లు జారీ చేసిన సందర్భంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం జరిగింది.ఈ దుర్ఘటన పైన బి.ఆర్ నాయుడు స్పందన పైన చాలామంది ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు.


టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ ఈ ఘటన జరగడం దురదృష్టకరమని తెలిపారు.. తాను చింతించడం తప్ప చేసేదేమీ లేదు అన్నట్లుగా ఈ విషయం పైన ఎవరిని నిందించలేమంటూ తెలియజేయడంతో చాలామంది ఈయనను బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నారని అసమర్ధతను ఇలా చాటిచెబుతున్నారంటూ భక్తులు కూడా టీటీడీ చైర్మన్ పైన విరుచుకుపడుతున్నారు. పోలీసులు అయితే అంతా తాము చూసుకుంటామని చెప్పారు.. కానీ దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు.


కనీసం తిరుపతిలో పరిస్థితి ఏంటి? క్యూలైన్లో ఉన్న భక్తుల పరిస్థితి ఏంటి అక్కడ తొక్కిసలాటకు జరగడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను కూడా తెలుసుకోవడానికి టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడుతో పాటు టీటీడీ ఉన్నత అధికారులకు లేకపోవడంతో చాలామంది విమర్శలు చేస్తున్నారట. గతంలో టీటీడీ చైర్మన్లు, ఈవోలు, జేఈవోలు ఎక్కువగా క్యూలైన్లను సందర్శిస్తూ ఉండేవారట. పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు పలు నిర్ణయాలను తీసుకోవడంతో ఇలాంటి ఘటనలు జరిగేవి కాదని భక్తులు కూడా తెలుపుతున్నారు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి టికెట్లు జారీ చేస్తామని చెప్పారు.. అందుకు తగ్గట్టుగా భద్రతను తీసుకోలేదు.. భక్తులు వాళ్ల తిప్పలు వాళ్లే పడతారనే రీతిలో అక్కడ అధికారులు ఉన్నట్లు భక్తులు వాపోతున్నారు..టీటీడీ పాలకమండలి చైర్మన్, ఉన్నత అధికారులు ఇలాంటి నిర్ణయాలతో భక్తుల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందనీ భక్తులు  వాపోతున్నారు.. చివరికి టీటీడీ చైర్మన్ కామెంట్స్తో భక్తులను తీవ్రమైన ఆగ్రహం మొదలవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: