అయితే తిరుమల వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ పూర్తి అయిందని సమాచారం అందుతోంది. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ టోకెన్ల జారీ పూర్తి చేసిందని తెలుస్తోంది. 10, 11, 12 తేదీలకు సంబంధించి లక్షా 20 వేల టోకెన్లను జారీ చేయాలని నిర్ణయం తీసుకోగా ఆ మేరకు టోకెన్ల జారీ పంపిణీ ప్రక్రియ పూర్తైంది. ఈ టోకెన్లను కలిగిన భక్తులను మాత్రమే రాబోయే మూడు రోజుల్లో అనుమతించనున్నారు.
తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ దర్శన టికెట్లను మాత్రం ఏరాజుకరోజు పంపిణీ చేయనున్నారని సమాచారం అందుతోంది. తిరుమలలో చోటు చేసుకుంటున్న కొన్ని ఘటనల వల్ల టీటీడీకి ఉన్న మంచి పేరు కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనల విషయంలో ఇతర రాజకీయ పార్టీల నుంచి కూటమి ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
రాజకీయ క్రీడా మైదానంగా టీటీడీ మారిందని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన విమర్శలు చేశారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ల ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని వైసీపీ డిమాండ్ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. లోప భూయిష్టమైన విధానాల వల్లే అమాయకులైన భక్తుల ప్రాణాలు పోయాయని ఆరోపణలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ తరహా ఘటనలు జరగకూడదని భక్తులు సైతం మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. ఈ ఘటన నేపథ్యంలో రాబోయే రోజుల్లో టీటీడీ ఏవైనా నిర్ణయాలు తీసుకోనుందేమో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.