వైసీపీ నేత మాజీ మంత్రి అయిన ముద్రగడ పద్మనాభరెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఆయన ఎక్కువగా కాపు సామాజిక వర్గం కోసం ఎక్కువగా పోరాటం చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా చంద్రబాబు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ,రాజశేఖర్ రెడ్డి , ఇతరత్రా ముఖ్యమంత్రిలతో కూడా ఈయనకు బాగా మంచి స్నేహబంధం ఉంది. అయితే ఇప్పుడు తాజాగా సీఎం చంద్రబాబుకి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరుగుతోంది వాటి గురించి చూద్దాం.


ముద్రగడ చంద్రబాబు స్నేహాన్ని ప్రస్తావిస్తూ.. వైసిపి నేతలపైన కూటమి సర్కార్ కక్షపూరితమైన వైఖరితోనే కొనసాగుతోంది అంటూ ముద్రగడ ఆరోపించడం జరిగింది.. ఈ వైఖరిని సైతం మార్చుకోవాలంటు ఆయన సూచించారు. ఒకవేళ జగన్ తిరిగి అధికారంలోకి వస్తే ఆయన కూడా కూటమి సర్కార్ లాగే ప్రతికారదాడులను కూడా పాల్పడితే అప్పుడు మీ పరిస్థితి ఏమి అంటూ కూడా సీఎం చంద్రబాబుని ప్రశ్నించడం జరిగింది. అలాగే ఈ లేఖలో ముద్రగడ తనదైన శైలి పదాలను కూడా వాడుతూ లేఖను చంద్రబాబుకు రాశారు.


గతంలో కూడా చంద్రబాబు తనని టిడిపిలోకి ఆహ్వానించారు అలా టిడిపిలోకి చేరి తాను పదేళ్లపాటు కొనసాగానని కానీ చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రస్తుత తీరు వేరు పగలు ప్రతీకారాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి గతంలో లేవని తెలిపారు. 1978లో వైయస్సార్, చంద్రబాబుతో కలిసి కూడా తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని కూడా తెలియజేశారు. అప్పుడు నేతల మధ్య ఉన్న స్నేహబంధాన్ని కూడా వివరించడం జరిగింది.


అప్పట్లో అక్రమ కేసులు పెట్టడం కానీ ఎప్పుడూ చూడలేదు.. ఏపీ ఎవరి జాగీరు కాదని ఏ ఒక్కరి స్టేట్ కూడా కాదని ముద్రగడ వివరించడం జరిగింది. అలాగే ఏపీలో రెడ్బుక్ పేరిట ప్రత్యర్థులపై నిత్యం ఏదో ఒక కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇది మంచి సాంప్రదాయం కాదంటూ కూడా తెలియజేయడం జరిగింది.. ప్రతి అమావాస్య తర్వాత కచ్చితంగా పౌర్ణమి పౌర్ణమి తర్వాత అమావాస్య వస్తుందంటూ వెల్లడించారు ముద్రగడ.. జగన్ కూడా తిరిగి అధికారంలోకి వస్తారని ఒకవేళ ఇదే జరిగితే ఆయన కూడా రెడ్బుక్ తరహాలో పాలన చేపడితే పరిస్థితి ఏమిటో అంటూ ప్రశ్నించడం జరిగింది. జగన్ సమయం పాటించిన కూడా వైసీపీ శ్రేణులు కచ్చితంగా ఒత్తిడికి లోనవుతున్నారు.. ఈ విషయంలో జగన్ పై కూడా ఒత్తిడి ఉంటుందని హెచ్చరించారు. గతంలో నేతల మధ్య కొనసాగిన స్నేహ బంధాన్ని గుర్తుకు చేసుకొనైన ఇలాంటి విషయాలను నియంత్రించాలంటూ చంద్రబాబును కోరడం జరిగింది. మరి ఈ విషయంపై సీఎం చంద్రబాబు ఏమంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: