ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో తొక్కిస్తాట ఘటన ఈరోజు ఉదయం నుంచి చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. చాలామంది భక్తుల కూడా ఈ విషయం పైన భయబ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఎక్కడ కూడా భద్రత లేని లోపం కనిపిస్తోంది అంటూ భక్తులు కూడా తెలియజేస్తున్నారు. దీంతో అటు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బాధితులను పరామర్శించడానికి వెళ్లడం జరిగింది. అయితే ఈ సంఘటన పైన తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు.


తొక్కిసలాట ఘటన పైన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ క్షమాపణలు కోరడం జరిగింది..తప్పు జరిగింది క్షమించాలని కూడా ఏపీ ప్రజలను విన్నవించుకున్నారు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ మీడియా ముఖంగా మాట్లాడుతూ ఇంతమంది అధికారులు ఉన్నప్పటికీ కూడా ఆరుగురు ప్రాణాలు  పోగొట్టడం సరికాదని తొక్కేసలాడు జరిగినప్పుడు కూడా రక్షణ సిబ్బంది ఏం చేస్తున్నారని భక్తులను కంట్రోల్ చేయలేరా అంటూ పవన్ కళ్యాణ్ ఫైర్ కావడం జరిగింది. ఈవో శ్యామల గారు, జేఈవో వెంకట చౌదరి పూర్తిగా విఫలమయ్యారని కూడా ఫైర్ కావడం జరిగింది.

అలాగే అభిమానులు పోలీసుల తీరు పైన కూడా పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.. మనసులు చనిపోయిన బాధ్యత కూడా వ్యవహరించకుండా అందరూ చుట్టిముడుతున్నారని అధికారులు తీరు కారణం వల్ల సీఎం చంద్రబాబుకు కూడా చెడ్డ పేరు వచ్చేలా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.అధికారులు తక్షణమే ప్రతి చిన్న పనిలో కూడా మేలుకోవాలని తెలియజేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పటికే భారీత కుటుంబాలకు కూడా నష్టపరహారం ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు అటు డిప్యూటీ సీఎం, సీఎం చంద్రబాబు ఎలాంటి ప్రకటనలు చేస్తారా చూడాలి మరి. రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: