చంద్రబాబు సమక్షంలోనే చైర్మన్ ఈవో పైన వాగ్వాదాన్ని సైతం తెలియజేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు పూర్తి అయిన తర్వాత టీటీడీ ఈవో, ఏఈఓ పైన మార్పు కచ్చితంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. కోట్లది మంది భక్తులు విశ్వసించే తిరుమల బాధ్యతను టీటీడీ పైన ఉంచగా ఇందులో ఈవో, ఏఈఓ వంటి వారి పాత్ర చాలా కీలకమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ మూడు స్థానాలలో ప్రత్యేకంగా కొంతమందిని ఎంపిక చేశారు. కానీ వీరి ఏడు మాసాల కాలంలోనే వీరి మధ్య సరైన సఖ్యత కనిపించలేదట.
తిరుపతిలో తొక్కిస్తాలాట ఘటన పైన సీఎం చంద్రబాబు సమక్షంలోనే అటు చైర్మన్, ఈఓ ఇద్దరూ కూడా చాలా వాగ్వాదానికి దిగడంతో ఈ విషయం పైన సీఎం చంద్రబాబు సీరియస్గా ఉన్నారట. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈవో, ఏఈఓ పై ఫైర్ అయినట్టుగా సమాచారం. ఈ ఘటన పైన పవన్ కళ్యాణ్ క్షమాపణలు కూడా చెప్పారు. అలాగే ఈవో శ్యామల రావు చైర్మన్ బి.ఆర్ నాయుడు.. అదనకు ఈవో వెంకయ్య చౌదరి పైన ఎవరికి వారు నిర్ణయం తీసుకుని వ్యవహరిస్తున్నారని ప్రభుత్వానికి నివేదికలు సైతం కొంతమంది ఇచ్చారట.
దీంతో వీరి మధ్య సఖ్యత లేదని చంద్రబాబు సమక్షంలో తేలడంతో వీరిని మార్చే వ్యవహారంలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సీఎంవోగా పనిచేస్తున్నటువంటి కీలక అధికారి టీటీడీ ఈవోగా బాధ్యతలు అప్పగించబోతున్నట్లు సమాచారం. అలాగే శ్యామలరావు తిరిగి తన శాఖకు పంపించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏఈఓ స్థానంలో ఒక యువ అధికారిని నియమించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.