ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ తీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరంగా మారుతున్నదట.ముఖ్యంగా ఆయన ఆవేశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారట కూటమినేతలు. ముఖ్యంగా తాను వివక్షంలో లేనని అధికార పక్షంలో ఉన్నట్టుగా గుర్తించలేకపోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ప్రదర్శించే ఆగ్రహం ప్రభుత్వానికి చేటు తెచ్చేలా చేస్తుందని పలువురు నేతలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారనే విధంగా పలువురు కార్యకర్తలు కూడా వాపోతున్నారు.


ఇటీవలే తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఉదాంతం అధికారులను, పోలీసులను, టీటీడీ వైఫల్యం అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఒకవేళ వారు చేసింది తప్పే అయినా అధికారంలో ఉన్నారు కాబట్టి చర్యలు తీసుకుంటే సరిపోతుంది.. బాధితులని పరామర్శించేందుకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కారులో నుంచి బయటికి వచ్చి మీడియా ముందర పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ అధికారుల పైన ఆగ్రహాన్ని ప్రదర్శించారు..ఇది చాలామంది నేతలను, అధికారులను అసంతృప్తికి గురయ్యేలా చేస్తోందట.


అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నది ప్రతిపక్ష తరహాలో వాదన అన్నట్లుగా చాలామంది వ్యతిరేకిస్తున్నారట. ముఖ్యంగా అధికారుల మీద విరుచుకు పడడం అది కూడా అందరం ముందే ఊగిపోవడం వంటివి చేయడంతో చాలామంది పవన్ కళ్యాణ్ ని అధికారంలో ఉన్నారనే విషయం మర్చిపోయారా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న చేష్టల వల్ల ఆయన మీద ఉన్న గౌరవం కూడా తగ్గిపోతోందని పలువురు కార్యకర్తలు కూడా వాపోతున్నారు. గతంలో జరిగిన కాకినాడ పోర్టు అక్రమ బియ్యం తరలింపు విషయంలో కూడా ఇలాగే జరిగింది.అలాగే తిరుపతి లడ్డు వ్యవహారం,మహిళల మీద జరుగుతున్న సంఘటనల పైన, హామీలు ఇచ్చిన వాటిపైన  కూడా పవన్ కళ్యాణ్ ఏదో ఒక విషయం పైన ఇలా స్పందిస్తూనే ఉన్నారు. కానీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి కానీ ఇలా అరుస్తే ఎలా అంటూ చాలామంది నేతలు కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: