బాధిత కుటుంబాలను క్షమించాలని వేడుకున్నారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అంతేకాదు... టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడుతోపాటు, టిటిడి బోర్డు సభ్యులందరూ... బాధితులు అందరికీ క్షమాపణలు చెప్పాల్సిందేనని కరాకండిగా తేల్చారు. అయితే... డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై... తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించడం జరిగింది.
ఈ సందర్భంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సింపుల్గా తిరస్కరించారు బిఆర్ నాయుడు. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. బాధితులకు క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు బి ఆర్ నాయుడు ను మీడియా సభ్యులు అడిగారు. అయితే దీనిపై వెంటనే టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు స్పందించారు. క్షమాపణలు చెబితే చనిపోయిన వారు బతికి వస్తారా..? అంటూ రెచ్చిపోయి మాట్లాడారు టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు.
ఎవరో ఏదో మాట్లాడారని... క్షమాపణలు చెబుతామా? అన్నట్లు స్పందించారు. ఏదైనా ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు తనకు చెబుతారని... మధ్యలో ఎవరూ కూడా మాట్లాడకూడదని కోరారు. అయితే పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి బి ఆర్ నాయుడు ఇలా స్పందించారని జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. క్షమాపణలు చెప్పాల్సింది పోగా.... పవన్ కళ్యాణ్ పై ఇలా మాట్లాడడం దారుణమని... ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన నేతలు. వెంటనే బిఆర్ నాయుడు.... పవన్ కళ్యాణ్ కు... క్షమాపణలు చెప్పాలని అంటున్నారు.