ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ పేరు ఎక్కడ చూసినా వినిపిస్తూ ఉండేది.. కానీ లేనిపోని మాటలు మాట్లాడడం పూర్తి సమాచారాన్ని తెలుసుకోకుండా నానా హంగామా చేయడం వల్ల ఈ మధ్యకాలంలో ట్రోల్ కి సైతం గురవుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే వైసిపి పార్టీకి 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలు రావడంతో ఇక పూర్తిగా పార్టీ పని అయిపోయిందని జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయింది అనే విధంగా చాలామంది కూటమినేతలు కూడా మాట్లాడారు.


అందుకే వైసిపి పార్టీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లడానికి చాలామంది నేతలు మక్కువ చూపారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా కూటమి నేతలలో భయాన్ని సైతం నింపించేలా జగన్ మైలేజ్ పెరిగిందా లేదా అనే విషయం పైన ఏపీ అంతట హాట్ టాపిక్ గా మారుతోంది. ఇటీవలే తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన అక్కడ బాధితులను సైతం పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ వెళ్లారు. అయితే అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడి అధికారులకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో మీడియా మొత్తం కూడా ఆయన వైపే ఫోకస్ చేయగా అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు కూడా పవన్ వైపే చూశారు.


కానీ సడన్గా ఒక్కసారిగా పెద్ద కోలాహలం అరుపులు నినాదాలతో జై జగన్ అంటూ ఒక్కసారిగా గాలిలోకి చేతులు పైకెత్తాయి. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. డిప్యూటీ సీఎం మాటలు వినిపిస్తున్న చోట ఒకసారిగా జగన్ నినాదాలు వైరల్ గా మారాయి. దీంతో పవన్ కళ్యాణ్ నే ఏం జరిగిందనే ప్రశ్నించే స్థాయికి పెరిగిపోయాయి. ప్రముఖ మీడియా సంస్థలు కూడా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మైకులు తీసుకుని అప్పటివరకు కొనసాగించిన ప్రసంగాన్ని ఆపివేసి మరి పరుగున జగన్ వైపుగా పరుగులు తీశారట. ఈ విషయం డిప్యూటీ సీఎం కూడా ఆశ్చర్యపరిచిందట. దీంతో వెంటనే ప్రసంగాన్ని ముగించి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి.


ఇలాంటి పరిణామాలు అన్ని చూస్తూ ఉంటే అనూహ్యంగా అందరి చేతులు కూడా జగన్ వైపు రావడం ,మీడియా సైతం జగన్ని ఎక్కువగా కవరేజ్ చేయడం వంటివి చేస్తూ ఉంటే జగన్ ఇమేజ్ పెరిగిపోయిందని ఏపీ అంతట చర్చ జరుగుతోంది. ఈ సందర్భంలోనే పవన్ ఇమేజ్ కూడా తగ్గిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: