అయితే మొదట ఈ ఇష్యులో తన పైన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పు పట్టారనే విధంగా వార్తలు వినిపించాయి. ఈ విషయాలను టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు ఖండిస్తూ క్షమాపణలు భక్తులకు తెలియజేశారు. ఈ మేరకు నిన్నటి రోజున సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి కామెంట్స్ కి తాను స్పందించాల్సిన అవసరం లేదని వెల్లడించారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తన వ్యాఖ్యలను అపార్థం చేసుకోకూడదని.. తన మాటలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అనలేదని వెల్లడించారు.
అంతేకాకుండా మొన్న జరిగిన ఘటనకు భక్తులకు మృతుల కుటుంబాలకు సైతం క్షమాపణలు తెలిపారు అంటూ తెలిపారు. ముఖ్యమంత్రి ,ఉప్ప ముఖ్యమంత్రి కంటే ముందుగా టీటీడీ పాలక మండలి క్షమాపణలు తెలియజేశారని చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. ఇదంతా ఇలా ఉండగా అన్నమయ్య భవనంలో నిర్వహించిన పాలకమండలిలో వారు మృతి చెందిన వారందరికీ కూడా టిటిడి ప్రగాఢ సంతాపం తెలియజేస్తుందని మృతి చెందిన 6 మంది కుటుంబాలకు 25 లక్షల రూపాయలు పరిహారం అందిస్తామంటూ తెలిపారు. గాయపడిన భక్తులకు 500000 అందిస్తామని వెల్లడించారు న్యాయ విచారణ నివేదిక బాధ్యతల పైన కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మిగిలిన 7 రోజులకు వైకుంఠ ద్వార దర్శనానికి ఏ రోజుకి ఆరోజు టికెట్లు ఇస్తామని తెలిపారు.