ఇది జరిగిందా? జరగలేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. సీజ్ ద షిప్ అనే డైలాగు మాత్రం బాగా ఫేమస్ అయిపోయింది. తర్వాత.. ఈ నౌకను కేంద్ర ప్రభుత్వం పంపించక తప్పదని తేల్చి చెప్పడంతో ఇటీవల నౌక వెళ్లిపోయింది. ఇది కొంతమేరకు పవన్‌కు ఇబ్బంది కలిగించింది. ఇక, వైసీపీ వ్యవహారంలో నూ.. రెండు సార్లు పవన్ కల్యాణ్ ఫెయిల్ అయ్యారు. 1) పల్నాడు జిల్లాలోని సరస్వతి భూముల వ్యవహా రంలో పవన్ నిరాసకు గురయ్యారు.
ఇప్పుడు తాజాగా 2వ ఘటనలో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారంలోనూ పవన్ కు నిరాస తప్పలేదు. సరస్వతి భూముల విషయంలో వైసీపీ అధినేత జగన్ అటవీ భూములు ఆక్రమించారని ఆరో పించారు. దీనిపై అధికారులను హుటాహుటిన ఆయన రంగంలోకి దింపారు. కానీ, జగన్ కానీ.. ఆయన పరివారం కానీ ఇలా చేయలేదని అధికారులే చెప్పుకొచ్చారు. దీంతో పవన్ ఇచ్చిన ఆదేశాలు తూచ్ అ య్యాయి.ఇక, తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కడపలో అటవీ భూమిని ఆక్రమించారని.. పేర్కొంటూ దీనిపైనా అధికారులను స్వయంగా పవనే రంగంలోకి దింపారు.
ఈ విషయంలోనూ అధికారులు సజ్జలకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఎలాంటి అటవీ భూమినీ ఆక్రమించలేదని తేల్చి చెప్పారు. దీంతో ఈ రెండు విషయాల్లోనూ పవన్ ఇచ్చిన ఆదేశాలు ఫెయిలయ్యాయి. అయితే.. ఇలా ఆయన ఆదేశాలు ఇవ్వడం వెనుక.. ఓ వర్గం మీడియాలో వస్తున్న వార్తలే కారణమన్న అభిప్రాయం అధికారుల మధ్య వినిపిస్తోంది. ఓ వర్గం మీడియాలో వైసీపీపై విమర్శలు చేస్తూ.. రాస్తున్న కథనాలను పవన్ కల్యాణ్ సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విచారణకు ఆదేశించారు. కానీ, అధికారుల నివేదికల్లో మాత్రం ఎలాంటి ఆరోపణలు కనిపించడం లేదు. సో.. మొత్తానికి పవన్ ఆదేశాలు.. అధికారుల నివేదికలు.. భిన్నంగా ఉండడం గమనార్హం.