ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైన గొడవ చోటు చేసుకుంది. కౌశిక్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ మధ్య తీవ్రమైన గొడవ చోటు చేసుకుంది.  ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం రసాభాసగా జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్  కుమార్‌ మాట్లాడుతుండగా ఆయన పైకి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి దూసుకెళ్లాడు.


నువ్ ఏ పార్టీ రా అంటూ దుర్భాషలాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్  కుమార్‌ ప్రసంగాన్ని అడ్డుకున్నారు  హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి. అయితే...  హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్  కుమార్‌  ఇద్దరూ బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచే గెలిచి... ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ... 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం కోల్పోవడంతో.. బీఆర్‌ఎస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్  కుమార్‌.


అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్  కుమార్‌. దీంతో అమ్ముడుపోయావు అంటూ సంజయ్ పై చేయి చేసుకోబోయారు కౌశిక్.  ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మంత్రులు పొన్నమ్, శ్రీధర్ బాబు ల సమక్షంలో ఈ ఘటన జరిగింది.


అయితే.... బీఆర్‌ఎస్‌ పార్టీకి  చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి చర్యలతో మంత్రులు ఎమ్మెల్యే లు ఒక్కసారిగా కులిక్కిపడ్డారు. అయితే.. అక్కడే ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ , ఇతర కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు.... హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్  కుమార్‌ ఇద్దరినీ శాంతింప జేశారు. అక్కడి నుంచి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని గంగుల తీసుకెళ్లి..బయటకు వెళ్లారు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్‌ గా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: