తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో.. పెను విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ రాజకీయ నాయకులు, సీనియర్ మాజీ పార్లమెంటు సభ్యులు.. మందా జగన్నాథం కాసేపటి క్రితమే మృతి చెందారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగర్ కర్నూల్ ఎంపీగా పనిచేసిన.. మందా జగన్నాథం అనారోగ్యంతో మరణించారు. గత కొన్ని రోజులుగా.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు మంద జగన్నాథం. ఈ తరుణంలోనే ఆయనకు ఆసుపత్రిలో వైద్యం కూడా అందించారు కుటుంబ సభ్యులు.


గత కొన్ని రోజులుగా హైదరాబాదులోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో... సీనియర్  మాజీ  పార్లమెంటు సభ్యులు.. మందా జగన్నాథం కు  వైద్యం అందించడం జరిగింది.  ఆయన మూత్రపిండాలు అలాగే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ  ఆస్పత్రిలో చేరడం జరిగింది. అయితే వీటి కోసం ప్రత్యేకంగా.. వైద్యుల బృందం చికిత్స అందించినప్పటికీ... ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ తరుణంలోనే ఇవాళ నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంటు సభ్యులు మంద జగన్నాథం మృతి చెందడం జరిగింది. ఈ మేరకు మంద జగన్నాథం కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేశారు.

ఇది ఇలా ఉండగా 1951 సంవత్సరం మే 22వ తేదీన పాలమూరు జిల్లా ఇటిక్యాలలో జన్మించారు సీనియర్  మాజీ  పార్లమెంటు సభ్యులు.. మందా జగన్నాథం. ఇక ఆయన ఉన్నత చదువులు చదివి... డాక్టర్ గా కూడా సేవలు అందించారు.  మెడిసిన్ విద్య చదివిన తర్వాత డాక్టర్ అయ్యారు మందా జగన్నాథం. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి దూసుకు వెళ్లారు. నాగర్ కర్నూల్ ఎంపీగా దాదాపు నాలుగు సార్లు పనిచేశారు మంద జగన్నాథం. 1996, 1999, 2004 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు మందా జగన్నాథం.


ఇక 2009 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత తెలంగాణ సాధన కోసం గులాబీ పార్టీలో  చేరారు మంద జగన్నాథం. ఇక 2014లో టిఆర్ఎస్ పార్టీ తరఫున ఓడిపోయిన మందా జగన్నాథం... ఆ పార్టీలో కొన్ని రోజులు కొనసాగారు. ఇక  2024 సంవత్సరంలో బహుజన సమాజ్వాది బీఎస్పీ లో చేరి... అనంతరం అనారోగ్యం పాలయ్యారు. అప్పటినుంచి రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు మందా జగన్నాథం. అయితే ఇవాళ ఆయన మరణించారు. ఆయన మరణ వార్త వినగానే రాజకీయ ప్రముఖులు... సంతాపం తెలుపుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: