దీనివల్ల లీటర్ పెట్రోల్, డీజిల్ కేవలం 55 రూపాయలకే రాబోతుందట. ఈ ప్రకటన చూసి వాహనదారులు ఆనంద పడుతూ ఉన్న కానీ ఇది సబ్సిడీ అందరికీ కాదు కానీ కొంతమందికి మాత్రమే అనే ట్విస్ట్ ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. ఈ బెనిఫిట్ కేవలం దివ్యాంగులకు మాత్రమే ఉంటుందట.వీళ్లకు మాత్రమే 55 రూపాయలకే ఇంధన అందించేలా ఏపీ ప్రభుత్వం చూసుకుంటోంది. ముఖ్యంగా ఆయా జిల్లాలలో సబ్సిడీపై పెట్రోల్, డీజిల్ పొందాలి అంటే కచ్చితంగా స్వయం ఉపాధి చేస్తున్న లేకపోతే ఏదైనా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారు అయి ఉండాలట.
పెట్రోల్, డీజిల్ పై సబ్సిడీ పొందాలి అంటే సంక్షేమ శాఖ కార్యాలయంలో సైతం అప్లై చేసుకోవాలట. మూడు చక్రాల మోటార్ వెడ్జ్ వాహనాన్ని కలిగి ఉన్న దివ్యాంగులు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ సబ్సిడీ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలలో 26 లక్షల మందికి కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ డబ్బులను సైతం లబ్ధిదారుల ఖాతాలు ఏపీ ప్రభుత్వం జయం చేయబోతుందట. అయితే ఈ సబ్సిడీ పైన కూడా కాల పరిమితి అనేది ఉంటుందట. ప్రతి నెల హెచ్పి వాహనంపై 15 లీటర్ల వరకు సబ్సిడీ అంతకంటే ఎక్కువ ఉంటే 25 లీటర్లకు మాత్రమే అవకాశాన్ని కల్పిస్తుందట. అయితే కచ్చితంగా అందుకు సంబంధించి పెట్రోల్ డీజిల్ బిల్లులను కూడా సమర్పించాల్సి ఉంటుందట.