ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చాలా విచ్ఛిన్నం అయిపోయిందనీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితి మారాలి అంటే కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలని అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని కూటమి ప్రభుత్వం కూడా తెలియజేసింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఎక్కడ ఎలాంటి తప్పు జరిగిన కూడా స్పందిస్తూ ఉన్నప్పటికీ కొన్ని పనులను వైసీపీ పార్టీ మీద తోసి వేయడంతో కూటమిలోనే చాలామందికి మింగుడు పడడం లేదట.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడవకముందే ఇప్పుడు కూటమినేతలలో ఒక భయం మొదలయ్యిందట. అదేమిటంటే మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారనె విషయాన్ని పారిశ్రామికవేత్తలు కూడా తెలియజేస్తున్నారని టాక్ ఆంధ్రప్రదేశ్ అంతట వినిపిస్తోంది. ఇటీవలే తిరుపతిలో జరిగిన సంఘటన అందుకు ఉదాహరణ అని కూడా చెప్పవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పటికీ చాలామంది మీడియా ఛానల్స్ కూడా అక్కడి నుంచి మైకులు తీసుకువెళ్లి మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్లేస్ కి వెళ్లడంతో డిప్యూటీ సీఎం కూడా ఆశ్చర్యపోయారట. దీంతో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ అక్కడ ప్రసంగాన్ని సైతం ముగించుకొని వెళ్ళిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే కూటమిలో జగన్ భయం అప్పుడే మొదలయ్యిందా అనే విధంగా ఏపీ అంతట వార్తలు వినిపిస్తున్నాయి. మరి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి టాక్ మారుస్తుందేమో చూడాలి.