తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. కేటీఆర్ పై నమోదు అయిన ఈ కార్ రేసు పై రకరకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ కేస్ ఫెక్ అంటూ గులాబీ నేతలు చెబుతుంటే... కాంగ్రెస్ నేతలు కచ్చితంగా కేటీఆర్ ను అరెస్టు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో.... గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్... సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు.

 ఈ కార్ రేస్ కారణంగా హైదరాబాద్ బ్రాండ్ పెరిగిందని... దానికి కేటీఆర్ కారణమని... పరోక్షంగా చెప్పారు. అయితే ఈ కార్ రేస్ లో స్కాం జరగలేదని ఆయన పరోక్షంగా చెప్పడం కూడా జరిగింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని దానం నాగేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ రెడ్డి వర్గం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గులాబీ పార్టీని ఖాళీ చేస్తానని... కేటీఆర్ అంతు చూస్తానని... గతంలో రెచ్చిపోయిన దానం నాగేందర్ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించాడని... మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.

 అయితే... కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మళ్లీ దానం నాగేందర్ యూటర్న్ తీసుకున్నారు. తాను కేటీఆర్ ను మెచ్చుకోలేదని... కేవలం ఈ కార్ రేసు బాగుందని చెప్పినట్లు వివరించారు. ఈ మధ్యకాలంలో తాను ఏది మాట్లాడిన హైలైట్ అవుతోందని... సెన్సేషన్ చేస్తున్నారని ఆయన సెటైర్లు పేల్చారు.  అయితే దానం వ్యవహారంపై... రాజకీయ విశ్లేషకులు చాలా భిన్నంగా స్పందిస్తున్నారు.

 గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత దానం నాగేందర్ ను పట్టించుకునే వాడు లేడని... రేవంత్ కూడా దూరం పెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాధాన్యత పెంచుకునేందుకు దానం ఇలా వ్యవహరిస్తున్నాడని చెబుతున్నారు విశ్లేషకులు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే... ఆయన దిగివచ్చి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని... అందుకే దానం ఇలా మాట్లాడడం జరుగుతోందని చెబుతున్నారు. పరోక్షంగా రేవంత్ రెడ్డిని.. దానం నాగేందర్ లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: