ఈ మధ్యకాలంలో తరుచూ తిరుపతి దేవ స్థానం గురించి తరచూ ఏదో ఒక విషయం వినిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా తిరుపతి లడ్డు వ్యవహారం, ఇటీవలే తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో భాగంగా తిరుపతి దేవస్థానం గురించి చాలా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా తిరుపతి దేవస్థానంలో  ఒక ఉద్యోగి ఏకంగా 100 గ్రాములు బంగారు బిస్కెట్ను సైతం దొంగలించిన ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా హాట్ టాపిక్ గా మారుతున్నది. ఔట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్యను అధికారులు కూడా పట్టుకొని ఆ బంగారాన్ని సైతం రికవరీ చేసినట్లుగా తెలుస్తోంది.



తిరుమల శ్రీవారి ఆలయం హుండీలో దొంగతనం చేసిన ఘటన ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. శనివారం రాత్రి ఈ బంగారు బిస్కెట్ ని దొంగలించారట. ట్రాలీ పైపులో ఈ బిస్కెట్ ని ఉంచారట. ఈ విషయాన్ని అక్కడ అధికారులు గుర్తించడంతో వెంటనే ఆ ఉద్యోగం అదుపులోకి తీసుకొని మరి విచారణ చేశారు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు కూడా చేయడం జరిగిందట. థర్డ్ పార్టీ ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పెంచలయ్యే అక్కడ పనిచేస్తున్నాడట. ముఖ్యంగా పరకాయణి వద్దకు ర్యాలీ నుంచి హుండీలను తీసుకువెళ్లే పని చేస్తున్నారట ఈయన.


శనివారం కూడా పరకాయణి వీధులలో ఉన్న ఈ నిందితుడు హుండీలను  తీసుకు వెళ్తూ ఉండగా అక్కడ ఒక్కసారిగా  అధికారులు తనకే చేశారు.. ర్యాలీ పైపులో బంగారం బిస్కెట్లు ఉన్నట్టుగా గుర్తించడంతో వెంటనే టిటిడి అధికారులు కూడా ఉలిక్కిపడి అక్కడికి చేరుకొని ఈ నేరానికి పాల్పడిన అతడిని పోలీసులకు అప్పగించారట. పరకాయణి చుట్టూ కూడా సీసీ కెమెరాలతో విజిలెన్స్ అధికారులు చాలా పశిష్టమైన భద్రతను చేపట్టారు. అలాంటి చోట ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేతివాడటం చూపడంతో పలు రకాల అనుమానాలను కూడా తెలియజేస్తున్నారు అధికారులు. నిందితులు ఒక్కడే ఈ పని చేయగలరా ? అనే డౌట్ కూడా మొదలయ్యిందట. మరి రాబోయే రోజుల్లో ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: