తిరుపతిలో ఈ మధ్యకాలంలో తరచూ ఎక్కువగా అపసృతులు జరుగుతూనే ఉన్నాయి.. మొదట తిరుపతి లడ్డు వ్యవహారంలో కల్తీ జరిగిందనే విషయం పైన ఎంత హంగామ జరిగిందా చెప్పాల్సిన పని లేదు ఇటీవలే వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేకమైన దర్శనం కోసం టికెట్లలో  భాగంగా తొక్కిసలాట జరగడంతో ఆరు మంది మృతి చెందారు.. దీంతో టీటీడీ పరిపాలన పైన చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇటీవలే ఒక ఉద్యోగి తిరుపతి హుండీలో నుంచి 100 గ్రాము గోల్డ్ బిస్కెట్ని సైతం దొంగలించారు. అయితే ఇప్పుడు తాజాగా తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.


తాజాగా తిరుపతిలో అపశృతి చోటు చేసుకున్నదట. తిరుమలలో లడ్డు పంపిణీ కౌంటర్లో ఈరోజు స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 47వ కౌంటర్లలో హఠాత్తుగా మంటలు రావడంతో భక్తులు భయాందోళ బయటికి పరుగులు తీశారట. వెంటనే సిబ్బంది సైతం అప్రమత్తమయ్యి  ఈ మంటలను ఆర్పి వేసినట్లు తెలుస్తోంది. ఈ మంటలను ఇతర కౌంటర్లకు వెళ్లకుండా ఆర్పి వేశారట అక్కడ సిబ్బంది. దీంతో ఒక్కసారిగా తిరుపతిలో భారీ ప్రమాదం కూడా తప్పిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అయ్యిందని లడ్డు పంపిణీ కౌంటర్లు స్వల్ప అగ్ని ప్రమాదం వల్ల అధికారులే కాకుండా అక్కడి భక్తులు కూడా భయభ్రాంతులకు గురయ్యారని.. ఈ ఘటన వల్ల ఎక్కడ ఎలాంటి నష్టం ఏమీ జరగలేదని తెలియడంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి గత కొద్ది రోజుల నుంచి తిరుపతిలోనే ఎక్కువగా అపసృతులు జరుగుతూనే ఉన్నాయి.. మరి వీటన్నిటికీ టీటీడీ సమస్త ఏ విధమైనటువంటి జవాబు చెబుతుందో చూడాలి మరి. ఇప్పటికే భక్తులు సైతం తిరుపతిలో జరుగుతున్న విషయాల పైన కాస్త అసంతృప్తితో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: