టిడిపి పార్టీలో నారా లోకేష్ కు ప్రత్యేకమైన స్థానం ఉన్నది సీఎం కుమారుడిగానే కాకుండా విద్యాశాఖ మంత్రిగా కూడా మంచి పేరు సంపాదించారు నారా లోకేష్. అంతేకాకుండా ప్రజలకు కార్యకర్తలకు ఏదైనా సహాయం కావాలని సోషల్ మీడియా వేదికగా తెలియజేసినా సరే కచ్చితంగా వాటిపైన స్పందిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే నారా లో కేసును డిప్యూటీ సీఎం గా చేయాలి అంటూ మహాసేన రాజేష్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని తెలియజేయడంతో ఈ వీడియో సంచనాలంగా మారింది.


మహాసేన రాజేష్ మాట్లాడుతూ.. 2024 ఎన్నికలకు ముందు నారా లోకేష్ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని అలా కష్టాల నుంచి ఆయన మీద పడ్డ కేసులు ఆయన పైన జరిగిన దాడులు ఈ రాష్ట్రంలో ఎవరి మీద కూడా జరగలేదని తెలియజేశారు. అన్ని కష్టాలు పడ్డ ఆయన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు ఆయనలాగా పార్టీలో కష్టపడ్డ వారు ఎవరైనా ఉన్నారా? అంటూ మహాసేన రాజేష్ ప్రశ్నించడం జరిగింది. అలాంటి నాయకుడిని ఇవాళ కొన్ని షరతులు విధించి ఎక్కడపడితే అక్కడ కూర్చోబెడుతున్నారంటూ తెలిపారు.


ఆయనను చూసి పార్టీలోకి వచ్చిన తమలాంటి వారికి చాలా బాధగా ఉందని నారా లోకేష్ కష్టంతోనే పైకి వచ్చారు.. దాదాపు 134 మంది టీడీపీ ఎమ్మెల్యేలు విజయాన్ని అందుకోవడంలో నారా లోకేష్ కీలకంగా మారారని చంద్రబాబు నాయుడు వాళ్లు ఏమనుకుంటారు వీరు ఏమనుకుంటారో వారసత్వం అనుకుంటారేమో అని ఆలోచిస్తూ ఉన్నారు. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే నారా లోకేష్ ఏ పదవిలో ఉన్నారో అనే విషయాన్ని ప్రజలు  గుర్తుంచుకోవాలని తెలిపారు.. నారా లోకేష్ కి అర్హత లేకపోతే బాధపడాలి కాని అలాంటి అర్హత ఉందంటూ తెలిపారు. నారా లోకేష్ ను వెంటనే డిప్యూటీ సీఎం చేయాలి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ని రాష్ట్ర అధ్యక్షులు మల్ల శ్రీనివాసుని ప్రశ్నించారు. 2029 ఎన్నికలలో ఏ విధంగా లోకేష్ ఎదురుకుంటారా అనే విషయంపైనే ఆలోచించాలని తెలిపారు. ఇలా మాట్లాడటం వల్ల తన మీద చాలామందికి కోపం ఉండవచ్చు.. ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా కార్యకర్తగా అడగడం తనకు సరే అనిపించిందంటూ తెలిపారు మహాసేన రాజేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: