రాజకీయాలలో సీనియర్ నేతలకు ఈమధ్య కొన్ని పార్టీలలో ఎక్కడ ప్రాధాన్యత కనిపించడం లేదు.. ముఖ్యంగా యంగ్ లీడర్స్కే ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నది..అందుకే సీనియర్స్ అంతా కూడా వచ్చే ఎలక్షన్స్ కి రిటైర్డ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి చాలా పార్టీల నుంచి.. అయితే వైసీపీలో మాత్రం సీనియర్ నేతలకు కాస్త పేరు బాగానే ఉన్నది. ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యులు అయిన పాలవలస రాజశేఖర్ నిన్నటి రోజున రాత్రి అనారోగ్య సమస్యతో కన్ను మూసినట్టుగా తెలుస్తోంది వాటి గురించి పూర్తి వివరాలలోకి వెళితే..



రాజశేఖరం గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఆయన ఇంట్లోనే పాలకొండలో మరణించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈయనకు గత కొద్ది రోజులుగా శ్వాసకు సంబంధించిన సమస్యలు ఎదురు కావడంతో కుటుంబ సభ్యులు నిన్నటి రోజున రాత్రి జేమ్స్ హాస్పిటల్ కి తరలించి అక్కడ చికిత్స చేయిస్తూ ఉన్నప్పటికీ మరణించారట. రాజశేఖర్ దివంగత సీఎం వైఎస్సార్ తో నేరుగా మాట్లాడే వారట. అలా వైఎస్ఆర్ కుటుంబంతో బంధం ఏర్పడిందట. అందుకే వైసిపి పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఎక్కువగా కొనసాగుతూ ఉండేవారని సమాచారం.


మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా ఈయనకు మంచి స్నేహ సంబంధం ఉండేదట. అలాగే ఈయన కుమారుడు విక్రాంత్ ఎమ్మెల్సీగా కూడా ఆయన కుమార్తె రెడ్డి శాంతి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారట. రాజశేఖరం భార్య ఇందుమతి కూడా రేగిడి జెడ్పిటిసి సభ్యురాలుగా కూడా కొనసాగిందట. వైసిపి సీనియర్ నేత మృతి చెందడంతో వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ విషయం వెళ్లడంతో వెంటనే జగన్ రాజశేఖర్ కుమారుడు విక్రమ్ కు , కుమార్తె రెడ్డి శాంతిని పరామర్శించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రాజశేఖరం మృతికి కూడా సంతాపం తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్ మృతి విన్న వైసిపి కార్యకర్తలు, నేతలు కూడా సంతాపం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: