తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్డర్లో... ఓ అరుదైన పోస్టర్ కలకలం రేపుతోంది. ఇప్పుడు ఈ పోస్టర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఇవాళ ఉదయం నుంచి ఈ పోస్టర్ వైరల్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే గులాబీ పార్టీ శ్రేణులు. ఇందులో అంతలా ఏముందంటే... కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోను కలిపి.. బ్యానర్ రెడీ చేశారు కొంతమంది.


కెసిఆర్ అలాగే చంద్రబాబు నాయుడు మధ్యలో.... బాలయ్య బాబు ఫోటో అతికించారు.  ప్రస్తుతం డాకు మహారాజ్ రిలీజ్ అయి థియేటర్లో నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే.... బాలయ్య పైన అభిమానం పెంచుకున్న కొంతమంది ఫ్యాన్స్... ఈ ఆసక్తికర బ్యానర్ ఏర్పాటు చేశారు.

ఇందులో ఒకవైపు... చంద్రబాబు ఉంటే మరొకవైపు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉన్నారు. మధ్యలో డాకు మహారాజు బాలయ్య ఉన్నాడు.  అంతేకాదు ఒకవైపు బాస్ ఇస్ బ్యాక్ అంటూ చంద్రబాబు ఫోటో వేశారు. ఇక మరొకవైపు బాస్ ఇస్ కమింగ్ సూన్ ఇన్ తెలంగాణ... అంటూ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫోటో వేసి.. రచ్చ చేశారు. ఈ ఆసక్తికర బ్యానర్ ఖమ్మం జిల్లా ముగ్గు వెంకటాపురంలో దర్శనం ఇవ్వడం జరిగింది.   అయితే ఈ బ్యానర్ కట్టింది బాలయ్య ఫ్యాన్స్ అని చెబుతున్నారు.


గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఇప్పుడు గులాబీ పార్టీలో కొనసాగుతున్న వారు ఈ పని చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. మొత్తానికి... తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలు కలిపి ఉన్న బ్యానర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ బ్యానర్ను గులాబీ పార్టీ శ్రేణులు చాలా వింతగా వాడుకుంటున్నారు. ఈ బ్యానర్ ను ఏపీలో ఏర్పాటు చేశారని.... కెసిఆర్ అంటే ఏపీ ప్రజలకు కూడా ఇష్టమని సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు గులాబీ పార్టీ శ్రేణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: