ఇటీవలే ఒక తమిళ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, బిజెపి అనుకూల వైఖరుల పైన కూడా పలు రకాల విమర్శలు చేయడం జరిగింది. చేగువేరా, గద్దర్ బిజెపి పార్టీకి అసలు సంబంధం ఏంటి ఇలాంటి రాజకీయాలు చేయడానికి పవన్ కళ్యాణ్ కి కనీసం సిగ్గుగా అనిపించడం లేదా? అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించడం జరిగింది.. వీరందరూ కూడా బిజెపి సిద్ధాంతిక వాటన్నిటికీ కూడా వ్యతిరేకంగా పనిచేశారని.. ఇప్పుడు వారందరినీ బీజేపీ అనుకూల వైఖరితో మాట్లాడడం సిగ్గుచేటుగా ఉందంటూ తెలిపారు.
హిందూ ధర్మం, సనాతన ధర్మం ప్రమాదంలో ఉందని దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారని.. అసలు ప్రమాదంలో ఉన్నది బీజేపీ అంటూ ఎద్దేవా చేశారు ప్రకాశరాజు. సినిమాలలో కలిసి నటించినప్పటికీ కూడా రాజకీయంగా మాత్రం అటు పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజుల పైన ఎప్పుడు కూడా విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా తిరుమల లడ్డు కల్తి వివాదం పైన పవన్ కళ్యాణ్ చేసిన వాక్యాలను సైతం ప్రకాష్ రాజు తప్పు పట్టడంతో అప్పటినుంచి వీరి మధ్య కూడా ట్వీట్ వారు కొనసాగుతూ ఉంది. ఇటీవలే తమిళనాడులో ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా.. తమిళ నటుడు డిప్యూటీ సీఎం ఉదయనిది స్టాలిన్ పైన ప్రశంసలు కురిపించారు ప్రకాష్ రాజు.. ఉదయనీది స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు మరొక డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అంటూ ఇష్టానుసారంగా మాట్లాడారు అంటూ పవన్ కళ్యాణ్ పైన పరోక్షంగా విమర్శించారు.