మంత్రులు ఎవరి దారి వారిదే. మంత్రికి తెలియకుండా రేవంత్ రెడ్డి చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా ఓ వాదన వస్తోంది. అయితే దీనికి తోడు రేవంత్ రెడ్డికి ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఈ వార్త గత రెండు మూడు నెలల నుంచి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇది రుజువు అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు... రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇచ్చారు.
కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం రెడ్ సిగ్నల్ రాహుల్ గాంధీ. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మళ్లీ హీట్ ఎక్కాయి. రేవంత్ రెడ్డి ఎంత చేసినా రాహుల్ గాంధీ దగ్గరకు రానివ్వడం లేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీకి దాదాపు 25 సార్లకు పైగా సీఎం రేవంత్ రెడ్డి... అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీతో అస్సలు కలవలేదు. పబ్లిక్ మీటింగ్లో తప్ప ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇచ్చిన సందర్భాలు.. లేవని తెలుస్తోంది.
కానీ తాజాగా షర్మిలకు అపాయింట్మెంట్ ఇచ్చి.. రేవంత్ రెడ్డికి ఇవ్వకపోవడంతో... రాహుల్ గాంధీ ఎంత స్థాయిలో సీరియస్ గా ఉన్నారో స్పష్టం అవుతోంది. అదా నీ వ్యవహారం, ఎమ్మెల్యేల చేరిక, తెలంగాణలో తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా రేవంత్ రెడ్డి పై రాహుల్ గాంధీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రాహుల్ గాంధీ.. ముందు నుంచి అలర్ట్ గా ఉంటున్నారట. రేవంత్ రెడ్డి తో చాలా డేంజర్ అని... దూరం పెడుతున్నారట.