పందెం కోడి కత్తి ధాటికి ఎక్కువ సంఖ్యలో నోట్ల కట్టలు తెగిపడ్డాయని చెప్పవచ్చు. రాత్రి సమయంలో కూడా కోడి పందేలు నిర్వహించడం గమనార్హం. తోడు కోత ముక్క, గుండాట లాంటి పందేలాను సైతం ఇక్కడ నిర్వహించారు. కొన్ని చోట్ల కార్పొరేట్ స్థాయిలో ఈ కోడి పండేల నిర్వహణ జరగడం గమనార్హం. కొంతమందికి కోట్ల రూపాయలు సొంతమైతే మరి కొందరు కోట్ల రూపాయలు కోల్పోయి డీలా పడ్డారు.
కూరగాయల సంచులలో నోట్ల కట్టలను తీసుకొని రావడం గమనార్హం. యువతులు సైతం జూద క్రీడల్లో పాల్గొనడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. మూడు రోజుల పాటు రాత్రీ పగలు అనే తేడాలు లేకుండా ఈ పోటీలను నిర్వహించడం కొసమెరుపు. సగటున పది బరులు ఏర్పాటు చేసి ఈ పోటీలను నిర్వహించారని సమాచారం అందుతోంది. చిన్నచిన్న గ్రామాలలో సైతం కోట్ల రూపాయలు చేతులు మారాయి.
కొన్ని చోట్ల ఏర్పాట్లను ఎమ్మెల్యేలు పర్యవేక్షించారని సమాచారం అందుతోంది. కొన్నిచోట్ల క్యాసినో తరహాలో జూదక్రీడలు నిర్వహించారని తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి కోడి పందేలలో 50 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారని సమాచారం అందుతోంది. కొన్నిచోట్ల వచ్చిన వాళ్లను నియంత్రించడానికి లేడీ బౌనర్లను ఏర్పాటు చేసినట్టు సమాచారం అందుతోంది. ఈ కోడి పందేలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. ఈ కోడి పందేలు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే జరుగుతాయనే సంగతి తెలిసిందే.