ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువ నాయకుడు, ఐటి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దూసుకు వెళ్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా గెలిచి.. అసెంబ్లీలో అడుగు పెట్టారు నారా లోకేష్. దాదాపు లక్ష వరకు మంగళగిరి నియోజకవర్గంలో మెజారిటీ సంపాదించుకున్న నారా లోకేష్... తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అంతకుముందు ఎమ్మెల్సీగా మంత్రి పదవి దక్కించుకున్న నారా లోకేష్ ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి తన ప్రతాపం ఏంటో చూపించారు.

 వార్డు మెంబర్ గా కూడా గెలవరని... ట్రోలింగ్  చేసిన వారికి... తన గెలుపుతో సమాధానం చెప్పారు నారా లోకేష్. అయితే నారా లోకేష్ గెలవగానే మంగళగిరి ప్రజల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి నారా లోకేష్ అని మంగళగిరి ప్రజలు ఓటు కూడా వేశారు. అయితే మంత్రయిన తర్వాత నారా లోకేష్.. మంగళగిరి అభివృద్ధి పైన దృష్టి పెట్టారు. అయితే ఇది గ్రౌండ్ స్థాయి వరకు వెళ్లలేదు.

 ఇలాంటి నేపథ్యంలో సంక్రాంతి కానుకగా ఓ అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. మంగళగిరిలో చేనేత కార్మికులు ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. అయితే మంగళగిరి చేనేత కార్మికులు నేసిన చీరను తన భార్య నారా బ్రాహ్మినికి సంక్రాంతి గిఫ్టుగా ఇచ్చారు నారా లోకేష్. తమ మంగళగిరి ప్రజలు ఎంతో కష్టపడి నేసిన చీర ఇది... ప్రపంచవ్యాప్తంగా మంగళగిరి చీరలకు.. ఇక్కడి కార్మికులకు ఎంతో గొప్ప పేరు ఉందని కొనియాడారు నారా లోకేష్.

 అయితే మంత్రి నారా లోకేష్ ఇచ్చిన గిఫ్ట్ కు... తన స్టైల్ లో రిప్లై ఇచ్చింది నారా బ్రాహ్మణి. చీర అద్భుతంగా ఉందని.. ఇలాంటి చీర మంగళగిరి చేనేత కార్మికులు మాత్రమే నేస్తారని ఆమె కూడా కాస్త డబ్బా కొట్టే ప్రయత్నం చేసింది. అయితే వీరిద్దరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో... ఏపీ ప్రజలు చాలా భిన్నంగా స్పందిస్తున్నారు. మీరు మీరే గిఫ్టులు ఇచ్చుకుంటున్నారు... మీరు చేసిన అభివృద్ధి ఏది అంటూ నిలదీస్తున్నారు ప్రజలు. ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ... అభివృద్ధి కనిపించడం లేదని సెటైర్లు పెంచుతున్నారు. కాస్త మంగళగిరి చేనేత కార్మికులను పట్టించుకోని... వారికి చేతినిండా పని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: