ఆంధ్రప్రదేశ్లోని ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కూటమిలో భాగంగా ఇప్పటికే మూడు పార్టీలు కొనసాగుతూ ఉన్నప్పటికీ తమ బలాలను పెంచుకునేందుకు ఒక్కొక్క పార్టీ పలు రకాల వ్యూహాలను అమలు చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఏపీ పైన బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఇప్పుడు మెగా ఆపరేషన్ మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తోంది. చిరంజీవితో రాజకీయంగా కలిసి వచ్చేందుకు బిజెపి పార్టీ భారీ స్కెచ్ వేసేలా చేస్తోందట. దీంతో చిరంజీవికి భారీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం.


ఇక పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికీ బీజేపీ ప్లాన్ కు మద్దతు పలుకుతూ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా బిజెపి నాయకత్వం పైన పలు రకాల రాజకీయంగా ఆశలు పెరిగినట్టుగా కనిపించాయి. ఏపీలో బిజెపి పార్టీ ఎదగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్న కలిసి రావడం లేదట ఇప్పుడు సరైన సమయంగా బిజెపి పార్టీ భావిస్తుందట.ఇందు కోసం మెగా హీరోల మద్దతు కూడా కోరినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం ప్రమాణస్వీకారం వేల మెగా బ్రదర్స్ ఇద్దరిని కూడా మోడీ అభినందించడం జరిగింది.


అలాగే గతంలో కూడా జగన్ సీఎం గా ఉన్నప్పుడు నరసాపురంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరిస్తున్న వేళ కూడా చిరంజీవికి కాస్త ప్రాధాన్యత అక్కడ లభించింది. అలాగే అయోధ్య రామాలయ ప్రారంభానికి కూడా ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట  జరిగిన సంక్రాంతి వేడుకలలో కూడా చిరంజీవి హాజరైనట్టుగా సమాచారం. ఇప్పుడు ఈ మెగా కాంబినేషన్ పైన ఆంధ్రప్రదేశ్లో బిజెపి పార్టీ రాజకీయాల పైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. మరి చిరంజీవి బిజెపి కి న్యాయకత్వం వహిస్తే  ఏ మేరకు పొలిటికల్ పరంగా ఏపీలో బిజెపి పార్టీకి కలిసొస్తుందో చూడాలి మరి. ముఖ్యంగా ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: