ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో ఉన్నటువంటి వాలంటరీలు అందరూ కూడా  సీఎం చంద్రబాబును కలిసేందుకు ఈనెల 17వ తేదీన అంటే ఈ రోజున అమరావతికి వెళ్ళబోతున్నారట. ఇందుకు సంబంధించి కొన్ని విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి. తమకు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను కూడా అసలు చెల్లించలేదని.. సంక్రాంతికి తమకు గుడ్ న్యూస్ చెబుతారని ఇప్పటివరకు వాలంటరీలు చాలా ఆశగా ఎదురుచూశామంటూ తెలుపుతున్నారు. గత వైసిపి ప్రభుత్వంలో నియమించినటువంటి ఈ వాలంటరీ వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిందంటూ సర్కార్ పైన ఫైర్ అవుతున్నారు.



కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటరీ జీతాలను పెంచుతామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కకు తప్పుకుంటున్నారంటూ వాపోతున్నారు. అంతేకాకుండా దీంతో అప్పటినుంచి నిరసనలు చేస్తూ ఉన్న వాలంటీర్లు తాజాగా ఇప్పుడు మరొక వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నారట ఈ విషయం పైన నిన్నటి రోజున విజయవాడలో ఒక ప్రకటన కూడా చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో వాలంటరీలను కొనసాగించడానికి జీవో ఇవ్వలేదని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడంతో మరి ఎన్నికల ముందు ఎలా కొనసాగిస్తామని .. జీతాలు పెంచుతామని చెప్పారంటూ వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు.



ఈ సందర్భంగా సంక్రాంతికి అందరు బకాయిలు తీర్చేసామని చెబుతున్న కూటమి ప్రభుత్వం తమ జీవితాలను మాత్రం ఎక్కడా చెల్లించలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలతోనే ఒక వినతి పత్రం తీసుకొని రేపటి రోజున అమరావతిలో జరిగేటువంటి ఏపీ క్యాబినెట్ వద్దకు వెళ్లాలని వాలంటీర్లు సైతం నిశ్చయించుకున్నారట. అంతేకాకుండా సీఎం చంద్రబాబు ఎన్నికలలో హామీలను ఇచ్చినటువంటి వాటిని నిలబెట్టుకోవాలంటే ఒక వినతి పత్రాన్ని వాలంటరీలందరూ కూడా సమర్పించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి సీఎం చంద్రబాబు వాలంటరీల జీతాలు పెంచి కొనసాగిస్తారా లేకపోతే వదిలేస్తారా అన్నది చూడాలి.. మొత్తానికి అయితే అటు వాలంటరీ వ్యవహారం వల్ల కూటమికి ముప్పు వచ్చేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: