ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి... ప్రస్తుతం లండన్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. మన సంక్రాంతి పండుగకు ఏపీలో ఉండకుండా.. తన కూతుర్ల కోసం లండన్ వెళ్లిపోయారు వైయస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు. రెండు రోజుల కిందట లండన్ కు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి దంపతులు... తమ కూతుర్లతో జాలీగా గడుపుతున్నారు. అయితే తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి... తన కూతుర్లతో దిగిన ఫోటోను షేర్ చేసి.. అదిరిపోయే న్యూస్ చెప్పాడు.

 

తన రెండవ కూతురు వర్షా రెడ్డి... డిస్టింక్షన్ లో ఉత్తీర్ణత సాధించిందని పేర్కొన్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. లండన్ లో ఉన్న ప్రముఖ కింగ్స్ కాలేజీలో... వర్షా రెడ్డి ఎంఎస్, ఫైనాన్స్ కోర్సు పూర్తి చేసి... డిస్టింక్షన్లు పాస్ అయిందని... వైయస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.  తన కూతురు వర్షా రెడ్డి ఈ ఘనత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి విజయాలు వర్షారెడ్డి మరిన్ని సాధించాలని కోరారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.


డియర్  అంటూ తన కూతురిని ఆప్యాయంగా  పిలుస్తూ.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశంసించారు. ఇక తన ఇద్దరు కూతుర్లతో పాటు.. దిగిన ఫోటోను వైయస్ జగన్మోహన్ రెడ్డి షేర్ చేయడం జరిగింది. ఇందులో బ్లాక్ కోట్ వేసుకొని... వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మొత్తం కనిపించింది. ఇక ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన వైసిపి అభిమానులు... అదిరిపోయే శుభవార్త చెప్పారు జగనన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఇది ఇలా ఉండగా.... తన కూతుర్లు పుట్టినప్పటినుంచి.. రాజకీయ వాసన తెలియకుండా పెంచుతున్నారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ల కెరియర్ ప్రారంభం నుంచి విదేశాల్లోనే చదివించారు. అయితే వాళ్ల చదువు పూర్తయిన తర్వాత రాజకీయాల్లోకి తీసుకు వస్తారా లేదా అనేది చూడాలి. లేకపోతే వాళ్ళ ఇద్దరికీ పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారా అనేది కూడా చర్చ జరుగుతుంది. మొత్తానికి వైయస్ ఫ్యామిలీ ఫోటో మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: