ఈ సమయంలోనే నారా లోకేష్ కూడా కీలకమైన నిర్ణయం దిశగా అడుగులు వేయబోతున్నారట. దీంతో ఇప్పుడు టిడిపిలో కీలకమైన మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతూనే రాజకీయంగా తన పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ స్టైల్ చూస్తే మనకి అర్థమవుతుంది. దీంతో ఇప్పుడు కూటమిలో రాజకీయ చర్చ కూడా కొనసాగుతోందట. పవన్ కళ్యాణ్ కూడా బిజెపితో మమేకమవుతూ ముందుకు వెళుతూ ఉన్నారు అంతేకాకుండా మెగా కుటుంబాన్ని సైతం బిజెపి పార్టీకే సపోర్ట్ చేసేలా చేశారు. చాలావరకు ఎక్కువగా పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది.
వీటిని గమనించిన చాలామంది టిడిపి సీనియర్లు లోకేష్ ను ప్రమోట్ చేయడానికి చంద్రబాబు వద్దకు పలు నిర్ణయాలను తీసుకువెళ్లినట్లు సమాచారం. అంతేకాకుండా లోకేష్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పైన కూడా అంచనాలను పెంచుతున్నారట. లోకేష్ పైన ఇప్పుడు పార్టీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నదట. లోకేష్ ప్రస్తుతం టిడిపి ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉన్నారు. అలాగే బాలకృష్ణకు పార్టీలో కూడా ఒక కీలకమైన పదవిలో ప్రమోషన్ ఇచ్చే విధంగా టిడిపి పార్టీ భావిస్తోందట. మొత్తానికి ఇలాంటి పరిణామాలన్నీ కూటమిలో చూస్తూ ఉంటే కూటమి త్వరలోనే విచ్చిన్నమయ్యేలా కనిపిస్తోందని వాదన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వినిపిస్తోంది. రాబోయే ఎన్నికలకు ఏ పార్టీలు ఎలా అధికారాన్ని చేపట్టాలని విధంగా లెక్కలు వేసుకుంటున్నాయి.