విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఉండదని కేంద్రం స్పష్టమైన సంకేతాలను వెల్లడించింది. నిర్వహణ విధుల కోసం ఇబ్బంది పడుతున్న స్టీల్ ప్లాంట్ కు కేంద్రం రూ. 17 వేల కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. అధికారి ప్రకటనను శుక్రవారం జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని గతంలో నిర్ణయాలు తీసు కున్నారు. 

అయితే మారిన రాజకీయ పరిస్థితులలో కేంద్రంలో టిడిపి కీలకంగా మారడం ఆ పార్టీ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని హామీ ఇవ్వడంతో కేంద్రం వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆపరేషనల్ ఖర్చుల కోసం ప్యాకేజీ ప్రకటించి తర్వాత ఆ సంస్థను పూర్తిస్థాయిలో బయటకు తీసుకురావడానికి అనేక చర్యలను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు  ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి


ప్రస్తుతం విశాఖ ప్లాంట్ లో మూడు బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా స్టీల్ ను తయారు చేస్తున్నారు. ప్లాంట్ కు ఉన్న ఆర్థిక ఇబ్బందులతో ముడి పదార్థాలను సమకూర్చుకోవడం పెద్ద సమస్యగా మారుతుంది. దీంతో రెండు బ్లాస్ట్ లనే నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కొత్తగా మూడు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసుల్ ఏర్పాటు కోసం నిధులు వెచ్చించే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త ఫర్నేసుల్ ఏర్పాటు కోసం ఒక్కొక్క దానికి రూ. 2500 కోట్ల నుంచి 3000 రూపాయల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. 

మూడింటికి రూ. 7500 కోట్లు అవసరమని అంచనాలు వేస్తున్నారు. వీటి ద్వారా నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి చేస్తారు. లాంగ్ ప్రోడక్టులు, భవన నిర్మాణాలు, మౌలిక వసతుల రంగంలో అధికంగా ఉపయోగించే స్టీల్ ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. మరో పదివేల కోట్లను నిర్వహణ ఖర్చుల కోసం ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అందు తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: