నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలను కూడా ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. అలాగే తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది చదువుకుంటే అంత మంది పిల్లలకు వర్తిస్తుందని చెప్పిన ఈ పథకానికి కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడతాయి.. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా చాలా కష్టమైనదే.. రైతులకు అన్నదాత సుఖీభవ 20వేల రూపాయలు.. మహిళలకు ప్రతినెల 1500 రూపాయలు, నిరుద్యోగులకు 3000 భృతి ఇవ్వడం వంటివి కూడా చాలా కీలకమని చెప్పవచ్చు.
ఇప్పటికే కూటమి ప్రభుత్వం పైన తల్లికి వందనం పధకం మీద ఒత్తిడి పెరుగుతోంది. అలాగే ఉచిత బస్సు మీద కూడా మహిళలు ఆశ పెట్టుకున్నప్పటికీ పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు. మహిళలకు ప్రతినెల 1500 రైతులకు ప్రతి ఏడాది 20 వేల రూపాయల కోసం ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలి అంటే చాలా కష్టతరమని చెప్పవచ్చు.. ఈ పథకాలన్నీ కూడా మహిళలను ఉద్దేశించే డిజైన్ చేసినప్పటికీ ఇప్పుడు వారిని నిరుత్సాహ పరుస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. మరి ఈ పథకాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలలో పలు రకాల మార్పులను చేసి అమలు చేస్తారేమో చూడాలి. ఇటీవలే మరొకసారి మంత్రులతో చర్చించి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతొందట.