ఘాట్ లో ఉన్న నందమూరి తారక రామారావు సమాధి కి నిండుగా పూలతో అలంకరణ కూడా చేశారు. ఇక నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా కాసేపటి క్రితమే... ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు నందమూరి కుటుంబ సభ్యులు. ఒక్కొక్కరు విడివిడిగా వస్తున్నారు. ఎప్పటి లాగే మొదటగా ఎన్టీఆర్ సమాధికి నివాళులు అర్పించారు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. నందమూరి బాలయ్యతో కాకుండా... జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సెపరేట్ గా వచ్చారు.
అనంతరం ఎన్టీఆర్ సమాధి వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. ఉదయం 5 గంటల సమయంలోనే... నందమూరి తారక రామారావు సమాధి వద్దకు వచ్చి... నివాళులు అర్పించారు ఇద్దరు మనుమలు. ఈ విషయం తెలియగానే.. అక్కడికి భారీ సంఖ్యలో.. ఫ్యాన్స్ చేరుకున్నారు. ఉదయం అయినప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఊహించి... నందమూరి తారక రామారావు సమాధి వద్దకు వచ్చారు ఫ్యాన్స్.
ఇక ఫ్యాన్స్ వచ్చినప్పటికీ... ఎలాంటి హడావిడి చేయకుండానే... నివాళులు అర్పించి.. సైలెంట్ గా అక్కడి నుంచి ఇంటికి వెళ్లి పోయారు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. ఇక ఈ ఇద్దరూ హీరోలు వెళ్లిపోగానే.... బాలయ్య రాబోతున్నారు. బాలయ్య తో పాటు నారా లోకేష్, లక్ష్మీ పార్వతి కూడా రానున్నారట. ఉదయం 7:30 నిమిషాలకు కుటుంబ సభ్యులతో ఘాట్ వద్ద కు చేరుకోనున్నారు మంత్రి నారా లోకేష్.