కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఏడు మాసాలు కావస్తు ఉన్నప్పటికీ అంతలోనే చాలామంది నేతలపైన కార్యకర్తలే అసంతృప్తిని తెలియజేస్తున్నారు. ఇటీవలే కొంతమంది ఎమ్మెల్యేల పైన కార్యకర్తలు ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కూడా టిడిపిలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన విజయం కోసం ఎంతో శ్రమించి కష్టపడినటువంటి కార్యకర్తలను కూడా పట్టించుకోవడంలేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈయనకు బాగా దగ్గరైన వారిలో కామేపల్లి తులసి బాబు ఒక కేసులో నిందితుడుగా కూడా తేలరట. ఆ వ్యక్తికి రాము సపోర్టు చేస్తూ ఉండడంతో సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఈయన పైన ఫైర్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.


దీంతో చాలామంది కార్యకర్తలు ఈ ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని అధిష్టానం పైన తీవ్రమైన ఒత్తిడి కూడా చేస్తున్నారట. రఘురామ కేసులో రాము అనుచరుడు తులసి బాబు ప్రమేయం లేనంతవరకు టిడిపిలో రాము ఒక హీరోగా వెలిగారు.. కానీ ఇప్పుడు టిడిపి కార్యకర్తలు ఈయన పైన ఫైర్ అవుతున్నారు. వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని పైన ఎన్నికలలో గెలవడానికి టిడిపి క్యాడర్ ఎంత సపోర్ట్ చేసిందో ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఫైర్ అవుతున్నారట.



ముఖ్యంగా రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో సైతం తులసి బాబు నిందితుడుగా తేలారు.. దీంతో తులసి బాబుని ఎమ్మెల్యే రాము దూరం పెట్టాల్సిందే అనే అభిప్రాయాలు మొదలవుతున్నప్పటికీ కానీ ఆయన మాత్రం పట్టించుకోలేదట. ముఖ్యంగా తులసి బాబును పోలీసులు తీసుకువెళ్లగానే కొన్ని వందల కార్లతో టిడిపి కార్యకర్తలను అక్కడికి పంపించడం వంటివి చేస్తున్నారట. ప్రస్తుతం గుడివాడలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యే రాము రాజకీయంగా ఆలోచించకపోవడమే వ్యక్తిగతంగా ఆలోచించడమే ఇప్పుడు మైనస్ గా మారిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సిఐడి మాజీ డిజి సునీల్ కుమార్ తో కూడా ఎమ్మెల్యే రాముకు మంచి స్నేహబంధం బంధుత్వం ఉన్నదట. మరి ఎమ్మెల్యే రాము ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: