ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మి పార్వతి హాట్ కామెంట్స్.. చేశారు. నా ఫోన్‌ నెంబర్‌ సోషల్ మీడియాలో పెట్టి వేధిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఇవాళ ఎన్టీఆర్‌ 29వ వర్ధంతి కార్యక్రమం అన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించిన తర్వాత... లక్ష్మి పార్వతి హాట్ కామెంట్స్ చేశారు. నిన్న నా ఫోన్ నంబర్ ఎవరో టీడీపీ వాళ్లు సోషల్ మీడియా లో పెట్టారని ఆరోపణలు చేశారు. నిన్నటి నుండి వెయ్యికి పైగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బాంబ్‌ పేల్చారు.


చూపించలేని అసభ్య మేసేజ్ లు కూడా వస్తున్నాయని ఫైర్‌ అయ్యారు. మీరు అనుకున్నా అనుకోకున్నా నేను మీ అత్తగారిని కదా చంద్ర బాబు అంటూ చురకలు అంటించారు. ఇలాంటి అవమానం నాకు జరుగుతుంటే ఇలానే చూస్తూ ఉంటారా అని చంద్రబాబుపై ఆగ్రహించారు. ఇన్నేళ్ళు డబ్బు ఉన్నా లేకున్నా ఎవరినీ చేయి చాచి అడగలేదు..ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా బ్రతుకుతున్నానని తెలిపారు లక్ష్మి పార్వతి.


నా మీద ఎందుకు మీకు కక్ష.. అసలు నేనేమీ తప్పు చేశానో కూడా నాకు అర్ధం కావడం లేదని తెలిపారు. ఎన్టీఆర్ పేరుతో మీరంతా లక్షలు కోట్లు సంపాదించారు..అలాగే పెద్దయాన్ని సాగనంపారని ఆగ్రహించారు. నాపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు..అంటూ నిలదీశారు.  మహిళలను గౌరవించే అవసరం మీకు లేదా..? అని ప్రశ్నించారు.  నా భర్త ఎలా చనిపోయారో , ఎన్ని కుతంత్రాలు జరిగాయో నాకు తెలుసు అన్నారు లక్ష్మి పార్వతి.


గత 30 ఏళ్లుగా పోరాటం చేస్తూ వస్తున్నానని వెల్లడించారు. ఇప్పటికీ ఆ దుర్మార్గుల ఆరాచకలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయన్నారు. నేను చేసిన తప్పు ఏంటో ఇప్పటికీ నాకు తెలియదని వివరించారు. అందరి సమక్షంలోనే ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నారన్నారు లక్ష్మి పార్వతి.  29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరమై మనో వేదనకు గురవుతున్నానని తెలిపారు. లక్షలాది ప్రజలు చూస్తుండగా నన్ను వివాహం చేసుకున్న విషయం మీకు తెలుసు.. నన్ను ఎందుకు ఈ కుటుంబ సభ్యురాలుగా చూడడం లేదని నిలదీశారు.




మరింత సమాచారం తెలుసుకోండి: