ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వారు చెప్పిన హామీలే కీలకమని చెప్పవచ్చు.. అయితే మేనిఫెస్టో ఆధారంగా చెప్పిన వాటిని అమలు చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడానికి ఎన్నోసార్లు క్యాబినెట్ మీటింగ్ లో కూడా మాట్లాడడం జరిగింది కూటమినేతలు. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ఏపీ క్యాబినెట్లో పలు రకాల నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం.


తల్లికి వందనం వచ్చే ఏడాది నుంచే ఇవ్వాలి అంటూ క్యాబినెట్లు నిర్ణయం తీసుకున్నారట. అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన రోజునే రైతుల ఖాతాలో ఈ నిధులను కూడా డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటుగా గ్రామీణ ప్రాంతాలలో 3సెంట్లు స్థలము, పట్టణాలలో 2సెంట్లు స్థలాలను పేదలకు ఇచ్చేలా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఉత్తర్లను జారీ చేశారట. అలాగే ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా త్వరలోనే అమలు చేయబోతున్నట్లు తెలియజేశారు. వీటితోపాటుగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.


వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భారీగా నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడంతో ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోజున అమిత్ షా సీఎం చంద్రబాబు ఇంటికి డిన్నర్ కి రాబోతున్నట్లు సమాచారం. ఈ విందుకు హోం మంత్రి అనిత అలాగే సత్యకుమార్ కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది వీరితోపాటు మరి కొంతమంది రాబోతున్నారట. మంత్రివర్గ సమావేశం అయిపోయిన వెంటనే.. అటు మంత్రులు ఎంపీలు జోన్లలో ఇన్చార్జిలతో పాటుగా పలువురు నేతలతో సీఎం చంద్రబాబు నివాసంలో సమావేశం అయ్యేలా చూస్తున్నారట. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అమలు చేయబోతున్న పథకాలను సైతం ఇతరత్రా కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని మంత్రులకు సైతం సీఎం చంద్రబాబు దిశ నిర్దేశాలను జారీ చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: