ముఖ్యంగా గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు మూడు కేటగిరీలుగా విభజించామంటూ అది కూడా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ తెలిపారు. ప్రస్తుతం సచివాలయలో సగటు 11 మంది చొప్పున సిబ్బంది పని చేస్తున్నారని ఇందులో చాలామందికి పని లేకుండా ఉండడం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో కొన్నిచోట్ల అధిక పని ఉండడం వల్ల సిబ్బంది ఇబ్బంది పడుతోందని ఫిర్యాదులు వచ్చాయని దీంతో జనాభా ఆధారంగా సచివాలయ ఉద్యోగులను విభజించి సర్దుబాటు చేస్తున్నామంటూ తెలిపారు. ముఖ్యంగా 3500 జనాభా ఉన్న ప్రజలు సచివాలయాలకు 8 మంది సిబ్బంది ఉంటారట.. అలాగే 2500 మంది జనాభా ఉంటే 7 మందని అంతకంటే తక్కువ జనాభా ఉంటే 6 మంది ఉంటారని తెలిపారు.
గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి హెడ్గా, మున్సిపాలిటీలలో నగర పంచాయతీలలో అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ సచివాలయాలకు సైతం హెడ్గా ఉంటారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 15 వేల గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఇందులో 1,26,000 మంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. ఈ సచివాలయాలలో 8 మంది పనిచేయాల్సిన చోట10 నుంచి 14 మంది పని చేస్తున్నారని అధికారులకు నివేదికలు అందడంతో ఇలా కేటగిరీలను మార్చేశారట. ఇక అలా మిగిలిన సచివాలయ ఉద్యోగులను ఆయా డిపార్ట్మెంట్ లకు కేటాయించాలని ప్రభుత్వానికి సైతం ప్రతిపాదనలు రావడంతో అక్కడికి పంపించేలా ప్లాన్ చేస్తున్నారట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈల కొరత ఉండడంతో ఇంజనీరింగ్ అసిస్టెంట్లను అక్కడికి పంపించేలా చూస్తున్నారట. అలాగే మిగిలిన శాఖల సిబ్బందిని కూడా సర్దుబాటు చేసేలా ప్రణాళికలను కూటమి ప్రభుత్వం చేయబడుతోందట.