సోమవారం రోజున టిడిపి హైకమాండ్ వద్దకు కొలికపూడి హాజరుకావాలని పలు రకాల ఆదేశాలను జారీ చేశారట. ఈనెల 11వ తేదీన ఎం కోడూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఒక ఎస్టి మహిళ పైన దాడి చేసిన ఘటనతో ఒక్కసారిగా పార్టీ కార్యక్రమాలు కొలికపూడి శ్రీనివాస పైన సీరియస్ నిర్ణయం తీసుకుందట. ఇప్పటికే ఎన్నోసార్లు వివాదాస్పదమైన విషయాలలో కూడా ఎమ్మెల్యే తల దూర్చడంతో అటు సీఎం చంద్రబాబుకు కూడా ఈ ఎమ్మెల్యే తీరు పైన విసిగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు గిరిజన మహిళల పైన దాడి చేయడంతో చంద్రబాబు ఆగ్రహం చేస్తున్నట్లు సమాచారం.. క్రమశిక్షణకు మారుపేరు టిడిపి అని చెబుతూ ఉన్నామని కానీ ఇలాంటి నేతలు ఇలా చేస్తే ఎలా అంటూ పలువురు నేతలు కార్యకర్తలు సైతం వాపోవడంతో.. కొలికపూడి పైన సీఎం చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇదంతా కూడా కొలకపూడి ఇచ్చే సమాధానం పైనే ఆధారపడి ఉంటుందట.సరైన సమాధానం చెప్పకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.గతంలో కూడా రైతుల పైన అటు ఎస్సీ రిజర్వేషన్ల పైన కూడా కొలకపూడి చేసిన వాక్యాలు చాలా వివాదాస్పదంగానే ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.